Bhavya laxmi Scheme : ఆడపిల్ల తండ్రులకు శుభవార్త… ప్రభుత్వం నుండి రెండు లక్షల ఆర్థిక సాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bhavya laxmi Scheme : ఆడపిల్ల తండ్రులకు శుభవార్త… ప్రభుత్వం నుండి రెండు లక్షల ఆర్థిక సాయం…!

Bhavya laxmi Scheme : దేశంలో ఆడపిల్లల సంఖ్య పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాల కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం అని అనుకుంటున్నా నేపద్యంలో అలాంటి ఆలోచనలు తరిమికొట్టేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక భరోసాని అందిస్తున్నారు. ఇక ఈ పథకం పేరు భాగ్యలక్ష్మి. ఇక ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Bhavya laxmi Scheme : ఆడపిల్ల తండ్రులకు శుభవార్త... ప్రభుత్వం నుండి రెండు లక్షల ఆర్థిక సాయం...!

Bhavya laxmi Scheme : దేశంలో ఆడపిల్లల సంఖ్య పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాల కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం అని అనుకుంటున్నా నేపద్యంలో అలాంటి ఆలోచనలు తరిమికొట్టేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక భరోసాని అందిస్తున్నారు. ఇక ఈ పథకం పేరు భాగ్యలక్ష్మి. ఇక ఈ పథకం వలన ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. అయితే ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకం ఇది. ఆడపిల్లల బృణ హత్యలను అరికట్టే దిశగా ఈ పథకాన్ని అమలు చేసినట్లు సమాచారం.

అయితే ఈ భాగ్యలక్ష్మి అనే పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతగానో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. అలాగే 21 ఎళ్లు నిండిన ఆడబిడ్డకు భాగ్యలక్ష్మి పథకం ద్వారా దాదాపు రెండు లక్షల రూపాయలు అందిస్తారట. ఈ నగదు మొత్తం ఆడపిల్ల చదువు పెళ్లి ఇతరత్ర ఖర్చులకు సహాయపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే దీని ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే మొత్తం తో పాటు తల్లిదండ్రులు వాయిదాల రూపంలో చెల్లించే మొత్తం రెండింటికి కొంతకాలం పూర్తయిన తర్వాత వడ్డీ కలిపి ఆడపిల్లలకు అందజేస్తారు.

అయితే ఈ పథకానికి అర్హులు అయిన వారు రెండు లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగి ఉండాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందట. ఇక ఈ పథకంలో చేరాలి అనుకునే వారు ముందుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం కోసం ఆడపిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల దృవీకరణ పత్రం, ఫోన్ నెంబర్ ,బ్యాంక్ ఖాతా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 31 మార్చి 2006 తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని గమనించాలి. ఇక ఈ పథకంలో మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.19,300 డిపాజిట్ చేయబడుతుంది. ఇక ఆ పిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత రూ.1,00,097 రూపాయలు ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెండో ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.18,350 డిపాజిట్ చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత రెండవ ఆడపిల్లకు రూ.1,00052 ఇవ్వబడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది