PPF Account : పీపీఎఫ్ అకౌంట్ లో కీలక మార్పులు.. డబ్బు డిపాజిట్ చేసేముందు ఇవి తెలుసుకొని డిపాజిట్ చేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PPF Account : పీపీఎఫ్ అకౌంట్ లో కీలక మార్పులు.. డబ్బు డిపాజిట్ చేసేముందు ఇవి తెలుసుకొని డిపాజిట్ చేయండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 October 2022,6:00 pm

PPF Account : పీపీఎఫ్ అకౌంట్ గురించి తెలుసు కదా. పబ్లిక ప్రావిడెంట్ ఫండ్ అది. సాధారణంగా ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ ఉంటుంది. అంటే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్. ఈపీఎఫ్ అంటే కంపెనీ ఉద్యోగి వేతనంలో నుంచి కొంత డిపాజిట్ చేస్తుంది. కానీ.. పీపీఎఫ్ అలా కాదు. ఒక ఉద్యోగికి ఎంత కావాలంటే అంత అందులో డిపాజిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. దాని మీద వడ్డీ కూడా వస్తుంది. అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ అకౌంట్ లో పలు మార్పులు చేసింది. పీపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్లు ఆ మార్పులు ఏంటో తెలుసుకోండి. సాధారణంగా పీపీఎఫ్ అకౌంట్ ను 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. ఒకవేళ ఎక్కువ రోజులు కావాలనుకున్నా పీపీఎఫ్ అకౌంట్ ను ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు.

డబ్బులు డిపాజిట్ చేయకున్నా అకౌంట్ ను కొనసాగించవచ్చు. ఒకసారి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చాక డబ్బును విత్ డ్రా చేసుకోవడమో లేక పీపీఎఫ్ అకౌంట్ ను ఎక్స్ టెన్షన్ చేసుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన డబ్బు మీద లోన్ తీసుకోవాలంటే కేవలం పీపీఎఫ్ బ్యాలెన్స్ మీద కేవలం 25 శాతం మాత్రమే లోన్ తీసుకోవచ్చు. అది కూడా రెండేళ్ల ముందు ఎంత అమౌంట్ అంటే అంతే డిపాజిట్ చేయొచ్చు. దాని మీద వడ్డీ రేటును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తారు. ప్రిన్సిపల్ అమౌంట్ రీపే చేశాక..!

big changes in PPF account done by central govt

big changes in PPF account done by central govt

PPF Account : పీపీఎఫ్ అకౌంట్ మీద లోన్ తీసుకోవాలంటే ఎలా?

రెండు ఇన్ స్టాల్ మెంట్స్ లో వడ్డీని కట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల ఒకటో తారీఖును వడ్డీని లెక్కిస్తారు. పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫామ్ ఏ కన్నా ఫామ్ వన్ ను సబ్మిట్ చేయాలి. 15 ఏళ్ల తర్వాత పీపీఎఫ్ అకౌంట్ ఎక్స్ టెన్షన్ కోసం ఒక సంవత్సరం మెచ్యూరిటీ పీరియడ్ ముగిశాక ఫామ్ హెచ్ బదులు ఫామ్ 4 ను నింపాల్సి ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ లో పెట్టుబడి పెట్టాలంటే రూ.50 మల్టిపుల్స్ అయి ఉండాలి. కనీసం రూ.500 లేదా అంటే కంటే ఎక్కువ ఒక సంవత్సరంలో పీపీఎఫ్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే సంవత్సరానికి రూ.1.5 లక్షలకు మాత్రం డిపాజిట్ పెరగకూడదు. నెలకు ఒకసారి పీపీఎఫ్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది