PPF Account : పీపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా చేస్తే ఎక్కువ వడ్డీ పొందొచ్చు.. రూ.1.5 కోట్ల లాభం వచ్చే బెస్క్ స్కీమ్
PPF Account : సాధారణంగా ఉద్యోగాలు చేసేవాళ్లకు ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. అది ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్. కానీ.. పీపీఎఫ్ అకౌంట్ కూడా ఒకటి ఉంటుంది. పీఎఫ్ లోనే అది మరో స్కీమ్. దాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. ఈపీఎఫ్ లో ఎంత డిపాజిట్ చేయాలో కంపెనీ నిర్ణయిస్తుంది. అంతకుమించి ఎక్కువ డిపాజిట్ చేయడానికి ఉండదు. కానీ.. పీపీఎఫ్ అకౌంట్ లో అలా కాదు. పీపీఎఫ్ లో ఎంత సేవ్ చేయాలనుకుంటే అంత శాతం సేవ్ చేసుకోవచ్చు. దాని మీద వడ్డీ కూడా వస్తుంది కాబట్టి టెన్షన్ ఉండదు. అలాగే టాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు.
పీపీఎఫ్ అకౌంట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని అడ్వాంటేజెస్ చాలామందికి తెలియవు. అసలు పీపీఎఫ్ వడ్డీని ఎలా కాలుక్యులేట్ చేస్తారు.. ఎలా ఎక్కువ వడ్డీని పొందొచ్చు అనేది తెలుసుకుంటే పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం అనేది మంచి స్కీమ్. నిజానికి 30 మార్చి 2020న ప్రభుత్వం పలు చిన్న సేవింగ్స్ స్కీమ్స్ కు వడ్డీ రేట్లను తగ్గించింది. పీపీఎఫ్ వడ్డీ రేట్లు 7.1 శాతంగా ఉండేది. అయితే.. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, పీపీఎఫ్ స్కీమ్స్ మీద వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేస్తుంటుంది.
PPF Account : పీపీఎఫ్ ద్వారా రూ.1.5 కోట్ల లాభం ఎలా పొందొచ్చు అంటే?
దానికి కారణం ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డీ రేట్లను మారుస్తుంటుంది. సంవత్సరానికి కనీసం రూ.1.5 లక్షలు పీపీఎఫ్ అకౌంట్ ద్వారా పెట్టుబడి పెట్టగలిగితే 30 ఏళ్ల తర్వాత కోట్ల లాభం వస్తుంది. మీరు నెలకు రూ.12,500 పీపీఎఫ్ అకౌంట్ లో పెట్టుబడి పెడితే.. 15 ఏళ్ల తర్వాత పీపీఎఫ్ అకౌంట్ ను బ్లాక్స్ గా పెంచుకోవచ్చు. అంటే మరో 5 ఏళ్లకు పెంచుకోవచ్చు. అంటే 30 ఏళ్ల తర్వాత మీ పీపీఎఫ్ అకౌంట్ లో ఎంత ఫండ్ ఉంటుందో తెలుసా? సుమారు రూ.1.5 కోట్లు. అక్షరాలా.. రూ.1,54,50,911 ఉంటుంది. మీరు ఇందులో పెట్టుబడి పెట్టేది కేవలం రూ.45 లక్షలు మాత్రమే కానీ.. వడ్డీతో కలిపి 30 ఏళ్ల తర్వాత మీకు వచ్చేది రూ.1.09 కోట్ల లాభం.