Huzurabad bypoll ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఈ భయమే వ్యక్తం అవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు ఫిక్సింగ్ చేసుకుంటాయని, టీఆర్ఎస్ ను దెబ్బకొట్టే వ్యూహంతో ఆ రెండు పార్టీలూ లోలోపల చేతులు కలుపుతాయని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పై ధిక్కార పతాకాన్ని ఎగరేసిన ఈటల రాజేందర్ కు లోపాయికారీగా సహకరించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చనేది కాంగ్రెస్ భావిస్తోందని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ ను ఓడించడం అనే ఉమ్మడి లక్ష్యం మేరకు ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి సహకారం అందిస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడో తిరుగుతున్న రేవంత్ రెడ్డి హుజూరాబాద్ కు రావడం లేదని చెబుతున్నారు.
ఈ వాదన బాగానే ఉంది కానీ, ఈటల రాజేందర్ గెలవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోవచ్చేమో కానీ, కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కానీ, బీజేపీ గెలవడం వల్లనే కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం.. ఎందుకుంటే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరి ఆ సమయంలో బీజేపీని గెలిపిస్తే, కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు జరుగుతుందన్నది వీరి వాదన. అంతేగాక 2023లో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చేది తామేనని ప్రకటించుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అడ్రస్ కోల్పోవడం, బీజేపీ పోటీ పడిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ లో బీజేపీకి గనుక కాంగ్రెస్ సహకారం అందిస్తే ఆ పార్టీ తనంతట తానే గొయ్యి తవ్వుకున్నట్లని విశ్లేషకులు అంటున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే.. అధికారాన్ని ఉపయోగించుకుని గెలిచారంటూ కాంగ్రెస్ తేల్చేయవచ్చు. అదే బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా మారితే, కాంగ్రెస్ కు అటు టీఆర్ఎస్ తోనూ, ఇటు బీజేపీతోనూ పోరాటం చేయాల్సి వస్తుంది.. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్న.. కేవలం ఈటెల రాజేందర్ కోసం బీజేపీ గెలుపును కాంగ్రెస్ కోరుకునేంత దుస్సాహసం చేయదన్నది సర్వత్రా వినిపిస్తోన్న మాట..
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
This website uses cookies.