Bigg Boss 5 telugu Winner : బిగ్ బాస్ 5 టైటిల్ విజేత సన్నీకి ట్రోఫీతో పాటు ఊహించని బహుమతులు..!
Bigg Boss 5 telugu Winner బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఎట్టకేలకు ముగిసింది. వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి నుంచే నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత గేమ్ తెలివిగా ఆడి టైటిల్ ను గెలవడమే కాక.. కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని ట్రోఫిని కైవసం చేసుకున్నాడు. టాప్ 5 లో ఉన్న యూట్యూబర్ షన్ను రన్నర్ అప్‌గా నిలవగా… మూడో స్థానంలో సింగర్ శ్రీరామ చంద్ర నిలిచాడు. బయట ఫాలోయింగ్ తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్లయిన వీరిద్దరితో పోటాపోటిగా ఆడి ముందంజలో నిలిచాడు సన్నీ. ప్రేక్షకుల మనసులు, బిగ్‌బాస్ ట్రోఫితో పాటు విన్నర్ సన్నీ గెలుచుకున్న బహుమతులే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
Bigg Boss 5 telugu Winner విజేత వీజే సన్నీకి రూ. కోటికి పైనే…!
కప్పు ముఖ్యం బిగిలు అంటూ… టైటిల్ సొంతం చేసుకున్న సన్నీకి బిగ్ బాస్ టీం నుంచి ఊహించని గిఫ్ట్స్ అందనున్నాయి. ప్రైజ్ మనీ రూ.50 లక్షలతో పాటు .. సువర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ 300 గజాల భూమిని కూడా ఇచ్చింది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే దారి షాద్ నగర్ సమీపంలో ఉంది. విన్నర్ సన్నీ వీటితో పాటుగా ఓ టీవీఎస్ బైక్ ను సొంతం చేసుకున్నారు. వీటన్నింటితో పాటు వారానికి ఇంత చొప్పున అని మొదటగా ఒప్పుకున్న రెమ్యునరేషన్ దీనికి అదనంగా ముట్టనుంది. ఇవన్నీ కలిపి సన్నీకి మొత్తంగా రూ. కోటి రూపాయలకు పైనే అందనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. బిగ్ బాస్ విజేతకు ఇంటి స్థలాన్ని గిఫ్ట్ గా ఇస్తున్న సువర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ… షో లో రన్నర్‌గా నిలిచిన షణ్ముక్ జశ్వంత్‌కు కూడా ఇంటి స్థలం ఇస్తామని ముందుకు రావడంతో.. షన్ను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గత 4 సీజన్స్‌కు భిన్నంగా ఈసారి సీజన్ 5ను 19 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 5 ఈ సారి సుపర్ హిట్ గా నిలిచింది. అయితే ప్రతీ యేటా సంవంత్సరం మధ్యలో స్టార్ట్ అయ్యే ఈ షో.. ఈ సారి మార్చిలోనే ప్రారంభం కానున్నట్లు నాగ్ చివరి ఏపిసోడ్ లో ప్రకటించారు. ఇదిలా ఉండగా విన్నర్ సన్నీ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వకముందు హీరోగా చేసిన.. సకల గుణాభిరామ అనే సినిమా డిసెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధమైంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సన్నీ.. ఇక రేపటి నుంచి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.