Bigg Boss 9 | బిగ్ బాస్ హౌజ్‌లో మొదటి రోజే లొల్లి.. ఈ పంచాయితీలు ఏ రేంజ్‌కి పోతాయో..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపారు. ఈ సీజన్‌కి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని లాహే లాహే లాహే సాంగ్‌తో మొదటిరోజు ప్రారంభించారు. కంటెస్టెంట్లు (కామనర్స్, సెలబ్రెటీలు) కూడా అందరూ డ్యాన్స్ చేశారు.

#image_title
రచ్చ రచ్చ
వారిని మరింత ఎనర్జిటిక్‌గా మార్చేందుకు డ్యాన్సర్స్‌ను కూడా లోపలికి పంపించాడు బిగ్‌బాస్. అనంతరం అందరూ హాల్ కూర్చొని ఉండగా.. బిగ్‌బాస్ అందరికీ స్వాగతం చెప్తుండగా ప్రోమో మొదలైంది. ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో చెమటలు పట్టాయంటూ ఇమ్మాన్యూయేల్ కామెడీ మొదలు పెట్టారు. బిగ్‌బాస్ 9 లాంచ్‌లో భాగంగా నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో భాగంగా హోజ్లో డిస్కషన్స్ మొదలయ్యాయి.
ఇంట్లో ఏ పని ఎవరు చేయాలనే దాని గురించి ఈ ప్రోమో సాగింది. దీనిలో భాగంగా కామనర్స్, సెలబ్రెటీలకు పనులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాకేమి పనులు ఇస్తున్నారో.. తర్వాత ఇవి వారికి వచ్చినప్పుడు వారు కూడా వీటిని చేయాల్సి ఉంటుందని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. కామనర్స్, సెలబ్రెటీల మధ్య జరగాల్సిన గొడవ.. కామనర్స్ మధ్యే జరిగినట్లు కనిపిస్తుంది. వీళ్లలో వీరికి కోఆర్డినేషన్ లేదనేది క్లియర్‌గా ఉంది. ఈ పనులు పంచే నేపథ్యంలోనే హరీశ్, మనీష్ మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపేందుకు భరణి ప్రయత్నించగా.. ఎవరూ తగ్గలేదు. మొదటిరోజే స్టేట్మెంట్ ఇచ్చిన హరీశ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
