ఏపీలో రూట్ మార్చిన బీజేపీ? ఫోకస్ ను అమవరాతికి షిఫ్ట్ చేశారు?
ఏపీలో ప్రస్తుతం అమరావతి ఉద్యమం జోరుమీదుంది. అక్కడి స్థానికులు చేసే ఈ ఉద్యమం ఏపీ సీఎం జగన్ కు దింగమింగుడుగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారు. ఓవైపు అభివృద్ధి అంటూ మూడు రాజధానులను ప్రకటిస్తే.. అమరావతి రైతులు మాత్రం ఒకే రాజధాని ముద్దు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు.
ఆ ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలో తెలియక సీఎం జగన్ సతమతమవుతున్నారు. ఇన్ని రోజులు అమరావతి ఉద్యమాన్ని కాస్త లైట్ తీసుకున్న జగన్.. ఇప్పుడు మాత్రం సీరియస్ గా ఉన్నారట. ఉద్యమాన్ని కట్టడి చేయడం కోసం.. దానిపై ఫోకస్ పెట్టారట.
కట్ చేస్తే.. బీజేపీ పార్టీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో బలంగా పాతుకుపోతోంది. తెలంగాణతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ పాగా వేయాలని చూస్తోంది. అందుకే తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టింది బీజేపీ.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ?
అందుకే.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… అమరావతి ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం ఏపీలోనూ బీజేపీకి స్పేస్ ఉంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇదే సరైన సమయం అని భావిస్తోంది.
అందులో భాగంగానే జనసేనతో బీజేపీ జతకట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
అమరావతి ఉద్యమం ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోనే జరుగుతోంది. దాన్ని రాష్ట్రమంతా విస్తరించేలా చేసేందుకు రైతులకు బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశం కూడా ఉందని.. దీని వల్ల జగన్ ను తీవ్రంగా ఇరుకులో పెట్టొచ్చని బీజేపీ భావిస్తోందట. చూద్దాం మరి.. భవిష్యత్తులో అమరావతి ఉద్యమం ఎంత దూరం వెళ్తుందో? బీజేపీ దాన్ని అనుకూలంగా మార్చుకొని ఏపీ ప్రజల విశ్వాసాన్ని ఎలా చూరగొంటుందో?