జీహెచ్ఎంసీ ఓట్ల శాతం చూస్తే షాక్ అవ్వాల్సిందే? బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎంత తేడా అంటే?
గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు వచ్చాయి. అందరినీ షాక్ కు గురి చేశాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఢీకొట్టి.. సెకండ్ ప్లేస్ లో నిలబడింది బీజేపీ. 2016 లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఏమాత్రం పోటీ కూడా ఇవ్వని బీజేపీ.. నాలుగేళ్లలో ఎంతలా పుంజుకుంది అంటే.. రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంత రేంజ్ లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది.
దానికి నిదర్శనమే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది టీఆర్ఎస్ పార్టీనే అయినప్పటికీ.. ఓట్ల శాతం చూసుకుంటే.. టీఆర్ఎస్ కంటే బీజేపీకి వచ్చిన ఓట్ల తేడా అత్యల్పం.

bjp got more votes than trs in ghmc elections
బీజేపీ కంటే టీఆర్ఎస్ కు ఎక్కువ వచ్చిన ఓట్లు కేవలం 6 వేలు మాత్రమే. టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 11,92,162 కాగా… బీజేపీకి వచ్చిన ఓట్లు 11,86,096. అంటే రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 6,066. శాతం పరంగా చూసుకుంటే.. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కంటే 0.18 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఈఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 34,44,093. వాటిలో కాంగ్రెస్ కు 2,20,504 ఓట్లు రాగా… ఎంఐఎంకు 6,30,867 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి కేవలం 55 వేల ఓట్లే పోలయ్యాయి. నోటాకు 28 వేలు పడ్డాయి. మరో 79 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు.