AP Elections : “బ్రేకింగ్” ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు..!
AP Elections : తెలంగాణలో 2018 లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి గుర్తుందా? 2019 లో జరగాల్సిన ఎన్నికలకు ఒక సంవత్సరం ముందే లాగి.. 2019 కి తీసుకొచ్చారు కేసీఆర్. మరి.. ఏపీలో కూడా ఇప్పుడు అదే జరగబోతోందా? 2024 లో జరగాల్సిన ఎన్నికలు 2023 లో జరగనున్నాయా? అనే అనుమానం అందరిలోనూ ఉంది. నిజానికి.. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అనేది చెప్పలేనప్పటికీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మాత్రం చాలామంది అంటున్నారు. అందుకే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండేందుకు అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికల అంశమే లేదని.. యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటున్నప్పటికీ ముందస్తు వస్తే ఎలా అనే డౌట్ లో ప్రతిపక్షాలు ఉన్నాయి. తాజాగా.. ముందస్తు ఎన్నికల గురించి బీజేపీ నేత సత్యకుమార్ కూడా స్పందించారు. ఏపీలో నో డౌట్.. ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయిని ఆయన జోస్యం చెప్పారు. దానికి కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉంటే.. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని.. అది వైసీపీకి మైనస్ అవుతుంది కాబట్టి.. ముందస్తు ఎన్నికల కోసం ముందే సీఎం జగన్ వ్యూహాలు కదుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాదు..
AP Elections : ఏప్రిల్, మే నెలలోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం
ఏప్రిల్, మే నెలల్లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రారంభం అవుతాయని.. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రతి సమాచారం తన వద్ద ఉందని సత్యకుమార్ చెప్పుకొచ్చారు. నిజానికి.. ఈ విషయం వైసీపీకి కూడా తెలుసని.. కానీ ఎలాంటి లీక్ చేయకుండా పైకి మాత్రం ముందస్తు లేదన్నట్టుగా వ్యవహరిస్తుందని.. కానీ.. ముందస్తుకు అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నుంచి మే నెలల్లో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. మరోవైపు సత్యకుమార్.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోము వీర్రాజు ఈ పదవిలో ఉన్నారు. మరి.. వీర్రాజు పదవీ కాలాన్ని పొడిగిస్తారా? లేక కొత్త నేతను నియమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.