Vijayashanthi : కేసీఆర్ ఆరోగ్యంపై విజయశాంతి సెటైర్లు?
Vijayashanthi : నాకేమైంది. ఏం కాలే. నా ఆరోగ్యం బాగుంది. ఇప్పుడే కాదు.. ఇంకో 10 ఏళ్ల వరకు నేనే సీఎం. ఇందులో డౌటే లేదు.. అంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న వార్తలకు చెక్ పెట్టేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారని.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ గత కొన్ని రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలకు తాజాగా.. టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో చెక్ పెట్టారు కేసీఆర్. దీంతో కేటీఆర్ సీఎం అనే ప్రచారం ఆగిపోయింది.
టీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా కాబోయే సీఎం కేటీఆర్, కేటీఆర్ సీఎం అయితే వచ్చే సమస్య ఏం ఉండదు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హుడే.. అంటూ బహిరంగంగానే ప్రకటించారు. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ చెక్ పెట్టేశారు.
అయితే.. నేనే ఇంకో 10 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా ఉంటా.. అంటూ కేసీఆర్ అనడంపై ప్రతిపక్షనేతలు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
Vijayashanthi : బీజేపీకి బయపడి.. 10 ఏళ్లు నేను సీఎం అంటున్నావా కేసీఆర్?
పదేళ్లు నేను సీఎంగా కొనసాగుతా అని అంటున్నారు కేసీఆర్. కానీ.. ఆయనకు తెలియని విషయం ఏంటంటే.. 2023లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గద్దె దింపుతున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండటం సంతోషకరమైన విషయమే కానీ.. వీళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే బాగా లేదు. ఆందోళనకరంగా ఉంది. అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులు ప్రమాదంలో పడిపోయాయి. దళిత బిడ్డలను మోసగించారు. ఇప్పుడు వారసుడికి పదవిని ఎట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ పార్టీ నిలదీసేసరికి.. నేనే ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉంటా.. అంటూ మాయమాటలు చెబుతున్నారు.. అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పదేళ్ల పాటు.. ఎప్పుడు ప్రగతి భవన్ లో ఉంటారో? ఎప్పుడు ఫాం హౌస్ లో ఉంటారో?
మబ్బుల మాటున ఉండే వానాకాలపు సూర్యుడిలా… మరో 10 సంవత్సరాల పాటు.. ప్రగతి భవన్ లో ఉంటారో… లేక ఎప్పుడు ఫాంహౌస్ లో దర్శనమిస్తారో అర్థం కాని అయోమయంతో జనాలు ఇంకో 10 ఏళ్లు తననే సీఎం చేయాలని కేసీఆర్ హెచ్చరిస్తున్నట్టు ఉంది. కానీ.. కేసీఆర్ కారు మబ్బులను త్వరలోనే చెదరగొడతారని కేసీఆర్ ఆర్థం చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు.
https://www.facebook.com/VijayashanthiOfficial/posts/1310140496019311