BJP : ఏపీలో జెండా పాతేందుకు బీజేపీ హోదా ఎత్తుగడ.. సాధ్యం అయ్యేనా?
BJP : తెలంగాణలో మెల్ల మెల్లగా బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ పై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో బీజేపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కు సంబంధించిన మంత్రులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం తెలంగాణలో బీజేపీ అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీలో కూడా బీజేపీ నిలదొక్కుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రత్యేక హోదా విషయం కారణంగా బీజేపీ ని అక్కడ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ అదే ప్రత్యేక హోదా హామీ మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా లు స్వయంగా ఏపీ విషయమై మాట్లాడారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయం ను తాము భర్తీ చేస్తామని అన్నట్లుగా హామీ ఇచ్చారు. అంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. జనసేనతో ఇప్పటికే పొత్తు లో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తే కచ్చితంగా ఏపీలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ లు కలిసి పోటీ చేయడం… అంతకు ముందే ప్రత్యేక హోదాను ప్రకటించడం ద్వారా కచ్చితంగా పాజిటివ్ ఫలితాలు వస్తాయని బిజెపి నాయకులు నమ్ముతున్నారు.సౌత్ ఇండియా లో కేవలం కర్ణాటక లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ముందుకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ని ఎంత వరకు నమ్ముతారు ఏపీ ప్రజలు అనేది చూడాలి. బీజేపీ ప్రభుత్వంకి అవకాశం ఉన్నా కూడా అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల కోసం ఈ అంశాన్ని లేవనెత్తి తర్వాత ఎన్నికల తర్వాత మొండి చేయి చూపిస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారి పక్కన ఉన్నాడు కనుక ప్రత్యేక హోదా తీసుకు వస్తాడేమో చూడాలని ఆసక్తిగా ఏపీ జనాలు ఎదురు చూస్తున్నారు. ఏపీలో బీజేపీ నిలవాలంటే.. గెలవాలంటే కేవలం ప్రత్యేక హోదాతోనే సాధ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.