Memory Tips | చదివిన పాఠాలు గుర్తుంచుకోవాలంటే వ్యాయామమే రహస్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Memory Tips | చదివిన పాఠాలు గుర్తుంచుకోవాలంటే వ్యాయామమే రహస్యం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :3 November 2025,7:07 pm

Memory Tips | చాలా మంది విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా, కొన్ని రోజుల్లోనే మర్చిపోతుంటారు. దీనికి తల్లిదండ్రులు పిల్లలను తెల్లవారు జామున లేపి చదివించటం, ఎక్కువ ఒత్తిడి పెట్టడం వంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే తాజాగా నిపుణులు వెల్లడించిన వివరాలు ఈ ఆందోళనలకు సమాధానంగా నిలిచాయి.

నిపుణులు చెబుతున్నట్లుగా, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మెదడులో ఒక “స్మృతి గుర్తు” ఏర్పడుతుంది. ఇది బలపడటానికి కొంత సమయం అవసరం అవుతుంది. చదివిన వెంటనే వ్యాయామం చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదని, కానీ 3-4 గంటల తర్వాత వ్యాయామం చేస్తే మెదడుకు అది ఒక పవర్‌ఫుల్ బూస్టర్ లా పనిచేస్తుందని తెలిపారు.

#image_title

BNDF ప్రోటీన్ ప్రభావం:
వ్యాయామం చేసినప్పుడు మెదడులో BNDF (Brain-Derived Neurotrophic Factor) అనే ప్రత్యేక ప్రోటీన్ విడుదల అవుతుంది. ఇది కొత్త నరాలు పెరగడానికి, ఉన్న నరాలు బలపడటానికి సహాయపడుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.

నిపుణుల సూచన:

* చదువు లేదా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తర్వాత 3–4 గంటలు విరామం ఇవ్వండి.
* తరువాత 20–30 నిమిషాలు చురుకుగా నడవండి, జాగింగ్ లేదా సైక్లింగ్ చేయండి.
* ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, చదివిన విషయాలు మరింత కాలం గుర్తుంటాయి.

మొత్తం మీద, జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే మందులు, ఒత్తిడి అవసరం లేదు ,రోజూ కొంత వ్యాయామం చేస్తే చాలు!

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది