ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా.. ప్రాణాలే పోగొట్టుకున్నావ్ కదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా.. ప్రాణాలే పోగొట్టుకున్నావ్ కదా..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 May 2021,1:10 pm

మనం ఇప్పటికే ఎన్నో వార్తలు చదివి ఉంటాం. సెల్ఫీ మోజులో పడి ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారని. అయినా కూడా ఈ జనాలు వినరు. సెల్ఫీ కోసం.. ఏదైనా చేస్తారు. మంచి సెల్ఫీ తీసుకొని.. సోషల్ మీడియాలో పెట్టి.. లైక్స్, కామెంట్స్ పొందాలనేది వాళ్ల బాధ. కానీ.. సెల్ఫీ పిచ్చి వల్ల ఒక్కోసారి తమ ప్రాణాలు పోతాయని కూడా తెలుసుకోరు. సెల్ఫీల కోసం ఎన్నో స్టంట్స్ చేస్తుంటారు. అలా స్టంట్స్ చేసి చనిపోయిన వారు కోకొల్లలు. అయినా కూడా జనాలలో ముఖ్యంగా యూత్ లో ఈ సెల్ఫీ పిచ్చి మాత్రం పోవడం లేదు.

boy died while trying to take selfie on tracker in tamilnadu

boy died while trying to take selfie on tracker in tamilnadu

తాజాగా తమిళనాడులోనూ ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సెల్ఫీ పిచ్చిలో పడి ఓ టీనేజ్ కుర్రాడు తన ప్రాణాలనే కోల్పోయాడు. తన కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి సెల్ఫీ మోజులో పడి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఆ 16 ఏళ్ల బాలుడు. ఇంతకీ ఆ బాలుడు ఎలా తన ప్రాణాలను కోల్పోయాడు. సెల్ఫీ ఎలా తన ప్రాణం తీసింది.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.

వద్దురా అన్నా వినకుండా ట్రాక్టర్ ఎక్కి?

ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నమోటూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల సంజీవి స్కూల్ కు వెళ్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండటంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. తన తండ్రికి ట్రాక్టర్ ఉంది. వ్యవసాయం చేస్తుంటాడు. తన ట్రాక్టర్ తో పొలం దున్నుతుంటాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన పొలం దున్నాలంటూ సంజీవి తండ్రిని కోరడంతో.. ఆయన పొలం దున్నేందుకు ట్రాక్టర్ వేసుకొని బయలు దేరుతుండగా.. ఇంట్లో ఖాళీగా ఉన్న సంజీవి.. తాను కూడా వస్తానంటూ మొండికేశాడు. దీంతో ఆయన తన కొడుకును కూడా అక్కడికి తీసుకెళ్లాడు. కాసేపు పొలం దున్నాడు. ఆ తర్వాత తనకు ఆకలవుతోందని.. ఇంటికి వెళ్లి అన్నం తిని వస్తా.. ఇక్కడే కూర్చో అంటూ తన కొడుకు సంజీవికి చెప్పి ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. ట్రాక్టర్ కీ దానికే ఉండటంతో.. సంజీవికి ఓ ఆలోచన తట్టింది.

ట్రాక్టర్ ఎక్కి మంచి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే ట్రాక్టర్ ఎక్కి.. స్టార్ట్ చేసి ట్రాక్టర్ ను ముందుకు నడిపిస్తూ.. సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే.. ట్రాక్టర్ అలాగే ముందుకు వెళ్తూ.. ఎదురుగా ఉన్న బావిలో పడిపోయింది. సెల్ఫీ మోజులో ఉన్న సంజీవి.. ముందు ఉన్న బావిని చూసుకోలేదు. దీంతో ట్రాక్టర్ తో పాటు సంజీవి కూడా బావిలో పడిపోయాడు. ట్రాక్టర్ బావిలో పడిపోవడం గమనించిన అక్కడి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని బావిలో నుంచి సంజీవిని బయటకు తీసినప్పటికీ.. అప్పటికే ట్రాక్టర్ కింద పడి సంజీవి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది