Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2026,8:00 am

ప్రధానాంశాలు:

  •  Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. స్థానిక పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ రోడ్లను శుభ్రం చేస్తూ గుండా వెళ్తుండగా అడ్డంగా ఒక బ్యాగ్ చూసింది. మొదట అమెకి ఏదో అనుమానం కలిగింది కానీ జాగ్రత్తగా బ్యాగ్ ని తెరిచేసిన తర్వాత ఆమెకు షాక్ అయ్యేలా పరిస్థితి ఏర్పడింది. ఆ బ్యాగ్ లో రూ. 45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాంటి భారీ విలువైన వస్తువును చూసి ఎక్కువ మంది భయపడేవాళ్ళా ఉంటారు. కానీ పద్మ తన నిజాయితీని మానవతా గుణంతో ప్రదర్శించింది. ఏ రకమైన స్వార్థం చూపకుండా వెంటనే ఆ బ్యాగ్ ను భద్రంగా తీసుకుని పాండీ బజార్ పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పింది.

Viral News నీ నీతి నిజాయితీకి లాల్ సలాం చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  పోలీసులు పరిశీలన చేసి నిజాయితీ ధృవీకరణ

పోలీసులు దర్యాప్తు జరిపి ఆ బ్యాగు నంగనల్లూర్‌కు చెందిన రమేశ్‌దిగా గుర్తించారు. రమేశ్ అనే వ్యక్తి తన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ పోయినట్లు ఫిర్యాదు చేసాడు. పోలీసులు బ్యాగ్ లోని బంగారు వస్తువులను రమేశ్ ఇచ్చిన వివరాలతో పోల్చి పరిశీలించిన తర్వాత అది నిజంగా రమేశ్ కు చెందినదని నిర్ధారించారు. అప్పుడు ఆ బ్యాగ్ ను రమేశ్ కు అందజేశారు. ఈ సందర్భంలో పద్మ తన నిజాయితీతో చేసిన పని సరిగ్గా గుర్తింపు పొందింది. ఆమె రోడ్డు పక్కన మాత్రమే కనుగొన్న బ్యాగ్ ను భద్రంగా పోలీస్ స్టేషన్ కు అప్పగించడం అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.

Viral News : రాష్ట్ర ప్రభుత్వం మరియు నెటిజన్ల ప్రశంసలు

పద్మ చేసిన నిజాయితీ పనికి చెన్నై వాసులు కాలనీ నివాసులు మరియు నెటిజన్లు గాఢమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరియు నమ్మకానికి సత్యనిష్టకి ఒక మంచి ఉదాహరణగా పరిగణించబడింది. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పద్మ చేసిన నిజాయితీకి ఫిదా అయ్యారు. ఆమెకు గౌరవ సత్కారంగా రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహం అందజేశారు. మరోవైపు పద్మ భర్త సుబ్రమణి కూడా ఇలాగే ఓసారి బ్యాగ్ దొరికితే పోలీస్ స్టేషన్ లో ఇచ్చి ప్రశంసలు పొందాడు. ఇక ఈ సంఘటన రాష్ట్రంలో నిజాయితీ నిస్వార్థ సేవలకు ఒక ప్రేరణగా మారింది. రోడ్డు పక్కన కనుగొన్న అమూల్యమైన వస్తువును భద్రంగా పోలీస్‌కి అప్పగించడం ద్వారా పద్మ ఒక జీవనమూల్యాన్ని చూపింది. ఇది ప్రతి వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది