Brahmanandam : సినిమాలో అవకాశం ఇవ్వరు కానీ ప్రమోషన్స్ మాత్రం చేపించుకుంటారు.. బ్రహ్మానందం ఫన్నీ కామెంట్స్..!
Brahmanandam | ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన జీవిత ప్రస్థానాన్ని ‘ME and मैं’ పేరుతో పుస్తక రూపంలో మార్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, ఇందులో తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను, అనుభవాలను పంచుకున్నారు. తనకు రాజకీయ నేపథ్యం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు.
“నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇప్పటివరకు 1200 చిత్రాల్లో నటించానంటే అది నటరాజ స్వామి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైంది” అని బ్రహ్మానందం తెలిపారు. తన జీవితం సినిమాలకే అంకితమని, నటనను ఎప్పటికీ వీడనని ఆయన అన్నారు. “నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చేమో గానీ.. నా పెదవికి ఇవ్వలేను. చివరి వరకు నవ్విస్తూనే ఉంటాను” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
కష్టపడి పనిచేస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని, ఈ విషయంలో వెంకయ్య నాయుడు తనకు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ గురించి ప్రస్తావిస్తూ, “నన్ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా ‘మీమ్స్ బాయ్’గా మార్చారు. ఏ రూపంలోనైనా సరే పదిమందినీ నవ్వించడమే నా ప్రధాన లక్ష్యం” అని బ్రహ్మానందం అన్నారు.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.