Family Died : అనుమానాస్పద రీతిలో ఆ కుటుంబంలో నలుగురు మృతి.. అదే కారణమా..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 3, 2022, 12:00 pm

Family Died : తమిళనాడులోని ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరుకు చెందిన మణి కంఠన్ (36)కు భార్య తార (35), ఇద్దరు పిల్లలు ధరణ్ (10), దహాన్ (1) పెరియార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న మణి కంఠన్.. భార్యతో మనస్పర్థల కారణంగా ఆగ్రహానికి గురై క్రికెట్ బ్యాట్‌తో ఆమెను కొట్టి చంపి..

అనంతరం తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను వంటగదిలోకి ఉరి వేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తార తలకు తీవ్ర గాయాలు కనిపించగా, చిన్నారులిద్దరూ పిల్లలు ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మణి కంఠన్ ఇరుగుపొరుగు వారిని, సహోద్యోగులను విచారించగా వారికి ఊహించని విషయాలు తెలిశాయని చెప్పారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు బానిసైన మణికంఠ…

Breaking Four members of the family died under suspicious circumstances in tamilanadu

Breaking Four members of the family died under suspicious circumstances in tamilanadu

స్నేహితుల నుంచి అప్పుచేశాడని తెలిపారు. భారీ అప్పుల పాలై.. ఉద్యోగానికి సరిగ్గా వెళ్లే వాడు కాదని చెప్పారు. కంప్యూటర్ కు బాగా అలవాటై ఇంట్లోనే ఉంటూ తరచూ భార్యతో గొడవలు పడే వాడని.. ఆ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp