Tamil Nadu Elections : ఏపీ కంటే దారుణంగా తమిళనాడు నాయకులు .. ఎలక్షన్స్ వేళ బిగ్ ట్విస్ట్
Tamil Nadu Elections : ఏపీ కంటే దారుణంగా తమిళనాడు నాయకులు .. ఎలక్షన్స్ వేళ బిగ్ ట్విస్ట్
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు, రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన దళపతి విజయ్ తమ సత్తా చాటాలని హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ పోటీలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు మాత్రం సామాన్యులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత అనే స్పృహ లేకుండా పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు చూస్తుంటే, ఆర్థిక వ్యవస్థను గాలికొదిలేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
Tamil Nadu Elections : ఏపీ కంటే దారుణంగా తమిళనాడు నాయకులు .. ఎలక్షన్స్ వేళ బిగ్ ట్విస్ట్
Tamil Nadu Elections: ఆర్థికంగా ప్రమాదకర స్థితిలో తమిళనాడు
తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర ఆదాయం ఏటా రూ.3.5 లక్షల కోట్లు ఉంటే, ఖర్చులు మాత్రం సుమారు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. అంటే వస్తున్న ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ. రాష్ట్రం ఇప్పటికే రూ.పది లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా కేవలం వడ్డీలు చెల్లించడానికే రూ.60 వేల కోట్లు ఖర్చవుతోంది. ఈ దయనీయమైన ఆర్థిక స్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా, ఎన్నికల కోసం పార్టీలు మరో లక్షన్నర కోట్ల రూపాయల భారాన్ని మోపే సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి.
Tamil Nadu Elections వాస్తవ దూరమైన హామీలు
ఏపీలో ఉచితాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది కానీ, తమిళనాడు రాజకీయ పార్టీలు చేస్తున్న హామీలు చూస్తుంటే పరిస్థితి అంతకుమించి అన్నట్లుగా ఉంది. నగదు బదిలీ, ఉచిత గ్యాస్, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు వంటి భారీ హామీలను అమలు చేయాలంటే, ఉన్న అప్పులు కాకుండా కొత్తగా మరిన్ని అప్పులు చేయక తప్పదు. రేపటి గురించి ఆలోచన లేకుండా, కేవలం ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాయి. ఆదాయం పెంచే మార్గాల గురించి కనీస అవగాహన లేకుండా ఇస్తున్న ఈ హామీలు అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయ పార్టీల తీరు చూస్తుంటే, అధికారం వస్తే చాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదనేలా తయారైంది. ఏది ఏమైనా ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లోని ఈ బిగ్ ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







