
bride pose in wedding video goes viral
Viral Video : కరోనా ఎప్పుడైతే వచ్చిందో.. పెళ్లి చేసుకునే వాళ్లకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత సంవత్సరం కరెక్ట్ గా పెళ్లిళ్ల సీజన్ లోనే కరోనా మొదటి వేవ్ రావడంతో చాలామంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొందరైతే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ లేకుండానే తూతూ మంత్రంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం కూడా సరిగ్గా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభానికి ముందే కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లంటే పందిళ్లు.. చప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలు అంటూ అప్పుడు పాడుకునే వాళ్లం. ఇప్పుడు పెళ్లంటే.. పందిళ్లు లేవు.. చప్పట్లు లేవు.. భజంత్రీలు లేవు. సింపుల్ గా ఇద్దరు ముగ్గురు అతిథుల మధ్య పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోతోంది.
bride pose in wedding video goes viral
ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఎందుకు ఇంత ఉపోద్ఘాతం అంటే.. ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎంతలా అంటే.. ఆ వీడియోను చూసి మీరు కూడా షాక్ అయిపోతారు. అది ఓ పెళ్లి వీడియో. పెళ్లిలో సాధారణంగా వీడియో గ్రాఫర్లు వీడియో తీస్తుంటారు కదా. అప్పుడు కెమెరాకు చిక్కిన వీడియో అది. ఓ పెళ్లిలో పెళ్లి కూతురు కెమెరాతో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పెళ్లి కూతురు పెళ్లి జరుగుతుంటే.. పెళ్లి కొడుకును వదిలేసి.. కెమెరా వైపే ఫోజు పెట్టింది. ఇక చూసుకోండి. కెమెరా వైపు అదోరకంగా చూస్తూ.. ఒక రకంగా ఫేస్ పెట్టి.. విక్టరీ సింబల్ చూపిస్తూ పెళ్లి కూతురు చేసిన స్టయిల్ మామూలుగా లేదు. రచ్చ రంబోలానే. ఆ పెళ్లి కూతురు చేసిన రచ్చ వీడియోను ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఏం నోటీస్ చేశారు. రెండు పెగ్గులు తీసుకురమ్మంటోందా వీడడియో గ్రాఫర్ ను అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.