Viral Video : ఎంత ఆకలేస్తే మాత్రం.. అంత పెద్ద గుడ్డును మింగేస్తుందా? ఈ పాము తిప్పలు మీరే చూడండి..!
Viral Video : పాముల గురించి తెలుసు కదా. అందులో విషపూరితమైన పాములు ఉంటాయి.. మామూలు పాములు కూడా ఉంటాయి. కొన్న పాములైతే చూడటానికి గంభీరంగా ఉంటాయి కానీ.. అవి కరవవు. అలాగే నీళ్లలోనూ కొన్ని పాములు ఉంటాయి. అయితే.. ఎక్కువగా విషపూరితమైన పాము అంటే నాగుపాము అని చెప్పుకోవచ్చు. అది కాటు వేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అందుకే.. పాములను చూస్తేనే కొందరు దడుసుకుంటారు. అది ఉన్న చోటుకు కూడా పోరు. అయితే.. పాములు కాటేసి చంపుతాయని తెలిసినా కూడా కొందరు నాగుపామును పూజిస్తుంటారు. నాగు పామును నాగ దేవతగా భావించి కొందరు పుట్టల్లో పాలు, గుడ్లు నాగ దేవతకు నైవేద్యంగా పెడుతుంటారు.
నిజానికి పాములు పాలు తాగవు.. గుడ్లు తినవు అంటుంటారు. అసలు పాములకు చెవులే వినిపించవు. కానీ.. నాగ దేవతకు భక్తులు పాలు, గుడ్లను నైవేద్యంగా పెడుతుంటారు. అవి తింటే తమకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని వాళ్ల నమ్మకం. ఏది ఏమైనా.. పాములు మాత్రం గుడ్లు తింటాయి.. అని తాజాగా రుజువు అయింది. ఎలాగంటారా? ఓ పాము.. ఏకంగా పేద్ద గుడ్డునే మింగేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video : అంత పేద్ద గుడ్డును ఆ పాము ఎలా మింగిందంటే?
సాధారణంగా పాములు చిన్న చిన్న పురుగులను, వేరే ఆహారాన్ని తింటుంటాయి. కానీ.. తాజాగా ఓ పాము.. తన కన్నా ఎంతో పెద్దగా ఉన్న గుడ్డును.. తన నోట్లో పట్టకున్నా కూడా .. ఎంతో కష్టపడి మింగేసింది. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నెటిజన్లు కూడా ఆ వీడియోపై పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. పాములు గుడ్లు తినడం మొదటిసారి చూస్తున్నా? ఇది నిజమేనా? అంటూ చాలా మంది నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అలాగే.. వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
https://twitter.com/afaf66551/status/1400399362019188743