దేవుడు చెప్పాడు.. పొలంలో బంగారు మ‌ల్ల‌న్న‌ విగ్ర‌హం ల‌భ్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

దేవుడు చెప్పాడు.. పొలంలో బంగారు మ‌ల్ల‌న్న‌ విగ్ర‌హం ల‌భ్యం..!

 Authored By uday | The Telugu News | Updated on :5 June 2021,9:40 pm

మ‌నం అప్పుడ‌ప్పుడు పొలంలో ప‌నుల చేస్తుంటే గుప్త నిధులు దొరికాయ‌నే వార్త‌లు వింటూనే ఉన్నాం. ఇలాంటి సంఘ‌ట‌నే తెలంగాణ, ములుగు జిల్లా క‌న్నాయిగూడెం మండ‌లం ముప్ప‌న‌ప‌ల్లి గ్రామంలో ఒక‌టి జ‌రింగింది. అయితే ఓ రైతు త‌న పోలం దున్నుతుండ‌గా ఆ పొలంలో బంగారు విగ్ర‌హం ల‌భ్య‌మ‌యింది. అయితే ఆ బంగారు విగ్ర‌హాన్ని మ‌ల్ల‌న్న దేవుడుగా భావించి పూజ‌ల‌కు కూడా నిర్వ‌హించాడు.

గుప్త నిధుల కోసం…

ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చి అధికారుల దృష్టికి వెళ్ళింది. అయితే ఆ రైతు వ‌ద్ద ఉన్న‌బంగారు విగ్ర‌హన్ని అదికారులు స్వాదీనం చేస‌కున్నారు. దీనిపై అదికారులు విచార‌ణ కూడా చేప‌ట్టారు. క‌న్నాయిగూడెం గ్రామంలో బిల్ల నారాయ‌ణ అనే వ్య‌క్తి గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెం చెందిన మ‌రో వ్య‌క్తితో త‌న పొలంలో త‌వ్వకాలు జ‌రిపాడు. ఆ త‌వ్వ‌కంలో బిల్ల నారాయ‌ణ‌కు 500 గ్రాముల బంగారు మ‌ల్ల‌న్న విగ్ర‌హం ల‌భ్య‌మ‌యింది. ఆ విగ్ర‌హానికి పూజ‌లు కూడా జ‌రిపాడు.

gold statue found in Telangana

gold statue found in Telangana

అయితే బిల్ల‌ నారాయ‌ణ గుప్త నిధుల కోసం త‌న పొలంలో జంతు బ‌లి కూడా చేశాడ‌ని ఆ గ్రామ‌స్తులు చెబుతున్నారు. వెంట‌నే ఈ విష‌యంపై గ్రామ‌స్తులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోని గుప్త నిధుల త‌వ్విన ప్ర‌దేశంను ప‌రిశీలించారు. త‌ర్వాత పోలీసులు నారాయ‌ణ ఇంటికి వెళ్లి స్వాదాలు చేయ‌గా 500 గ్రాముల మ‌ల్ల‌న్న విగ్ర‌హం దొరికింది. దీంతో నారాయ‌ణ అస‌లు విష‌యం చెప్పాడు.నాకు మే నెల‌లో త‌న పొలంలో మ‌ల్ల‌న్న విగ్ర‌హం ఉన్న‌ట్లు క‌ల వ‌చ్చింద‌ని అందుకే మే 26 న త‌న పొలంలో మ‌రో వ్య‌క్తితో త‌వ్వ‌కాలు చేశాన‌ని నారాయ‌ణ చెప్పాడు. దీంతో ఆ బంగారు మ‌ల్ల‌న్న విగ్ర‌హాన్ని రెవిన్యూ అధికారులు స్వాధినం చేసుకొని నారాయ‌ణ‌ను త‌న‌కు సాయం చేసిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> వీడియో వైరల్‌.. వ‌ధువుకి బ‌దులు అత్త మెడ‌లో వేసిన వ‌రుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒక్క చేప ధ‌ర 72 లక్ష‌లు.. ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది.. దాని ప్ర‌త్యేక‌త ఏమిటి…?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎంత ఆకలేస్తే మాత్రం.. అంత పెద్ద గుడ్డును మింగేస్తుందా? ఈ పాము తిప్పలు మీరే చూడండి..!

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది