Viral Video : పెళ్లికి వచ్చిన అతిథి చెంప చెళ్లుమనిపించిన పెళ్లి కూతురు.. ఎందుకో తెలిస్తే బిత్తరపోతారు?
Viral Video : పెళ్లంటే పందిళ్లు చప్పట్లు.. తాళాలు తలంబ్రాలు.. అంటుంటారు పెద్దలు. పెళ్లంటే ఊరంతా హడావుడి ఉంటుంది. వారం రోజుల నుంచే ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును సరదాగా ఆటపట్టిస్తుంటారు. పెళ్లంటేనే అలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే.. తమ జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు. అందుకే.. ఆ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా.. పెళ్లిని నిర్వహిస్తుంటారు.

bride slaps man during wedding video viral
అయితే.. ఒక్కోసారి నవ్వులు పోయి నువ్వులు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అంటే.. ఏదో ఆటపట్టించాలని చేస్తే.. అదే సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే.. అన్ని పెళ్లిళ్లలో జరగకపోవచ్చు కానీ.. కొన్ని సార్లు పెళ్లిళ్లలో గొడవలు కూడా జరుగుతుంటాయి. ఏదో చిన్న విషయానికే గొడవ పడుతుంటారు. తాజాగా పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుండగా.. పెళ్లి కూతురు పెళ్లికి వచ్చిన అతిథి చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video : పెళ్లి కూతురు చేసిన పనికి బిత్తరపోయిన అతిథి
పెళ్లి అయ్యాక.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటారు కదా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో దండ వేయబోతుండగా.. ఓ అతిథి వచ్చి పెళ్లి కొడుకును ఎత్తుకుంటాడు. దీంతో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు అందడు. దీంతో మరో అతిథి వచ్చి.. పెళ్లి కూతురును ఎత్తుకుంటాడు. దీంతో పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు మెడలో దండ వేస్తుంది. అయితే.. పెళ్లి కూతురు కిందికి దిగాక.. తనను ఎత్తుకున్న అతిథి చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఆ అతిథి వెంటనే బిత్తరపోయాడు. అసలు.. ఏం జరుగుతోందా? అని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ వ్యక్తి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా.. తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
தவறி விழுற வீடியோ இல்லை..
புருஷன் மைன்ட் வாய்ஸ் என்னவாயிருக்கும் என்பதை சொல்லவும் pic.twitter.com/wDNmDLXEVa— ஞானக்குத்து (@Gnanakuthu) July 2, 2018