Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా గొప్పవని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి కీలక పోషకాలతో నిండి ఉన్న వంకాయ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది.

#image_title
గుండె ఆరోగ్యానికి రక్షణ కవచం
వంకాయలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం గుండె సంబంధిత సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఇది కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గించి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.
మధుమేహ నియంత్రణకు సహాయం
వంకాయలోని ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదించడంతో, రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఉంటుంది. ఇది టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
క్యాన్సర్ నివారణకు సహాయపడే శక్తివంతమైన పదార్థాలు
వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది.
బరువు తగ్గేందుకు సహకారం
వంకాయలో కొవ్వు చాలా తక్కువగా ఉండడంతో పాటు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు బర్నింగ్ రేటును పెంచి, శక్తిని సరైన మార్గంలో వినియోగించడానికి సహాయపడుతుంది.
వంకాయలో ముఖ్య పోషకాలు:
ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ B3, B6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు