Hardik Pandya : మళ్లీ ప్రేమలో పడిన హార్ధిక్ పాండ్యా.. ఎవరీ జాస్మిన్…!
Hardik Pandya :టీమిండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బ్యాటర్‌గా, బౌలర్‌గా ఆల్‌రౌండర్ పర్‌ఫార్మెన్స్ చేస్తూ టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ రావడంలో కీలక భాగం అయ్యాడు.అయితే పాండ్యా పర్సనల్ లైఫ్ విషయంలో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి గత నెలలో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరొకరితో ప్రేమలో పడ్డాడా? ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ చేస్తున్నాడా? బ్రిటీష్ […]
ప్రధానాంశాలు:
Hardik Pandya : మళ్లీ ప్రేమలో పడిన హార్ధిక్ పాండ్యా.. ఎవరీ జాస్మిన్...!
Hardik Pandya :టీమిండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బ్యాటర్‌గా, బౌలర్‌గా ఆల్‌రౌండర్ పర్‌ఫార్మెన్స్ చేస్తూ టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ రావడంలో కీలక భాగం అయ్యాడు.అయితే పాండ్యా పర్సనల్ లైఫ్ విషయంలో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. సెర్బియా నటి, తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి గత నెలలో విడాకులు తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరొకరితో ప్రేమలో పడ్డాడా? ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ చేస్తున్నాడా? బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం జాస్మిన్‌తో కలిసి హార్దిక్ వెకేషన్ మూడ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి
Hardik Pandya కొత్త ప్రేమాయణం..
నాలుగేళ్ల మ్యారేజ్ బాండ్‌కు జూలైలో పాండ్యా, నటాషా వీడ్కోలు పలికారు. అయితే గ్రీస్‌లో ఉన్న ఓ లొకేషన్ నుంచి హార్దిక్‌తో పాటు సింగర్ జాస్మిన్ ఒకే విధమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింగర్ జాస్మిన్ .. బ్లూ కలర్ బికినీ.. బ్లూ షర్ట్‌తో .. ఓ పూల్ వద్ద ఫోటో దిగింది. ఆ ఫోటో బ్యాక్‌డ్రాప్‌లో మైకోనస్ సీనరి కనిపిస్తోంది. స్ట్రా హ్యాట్, ఓవర్‌సైజ్ సన్‌గ్లాసెస్‌తో ఆమె దర్శనమివ్వగా, అదే పూల్ వద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేశాడు. క్రీమ్ కలర్ ప్యాంట్, ప్రింట్ షర్ట్, సన్‌గ్లాసెస్‌తో హార్దిక్ వెరైటీ లుక్‌లో ఉన్నాడు. ఫోటోల్లో ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ కావడంతో.. ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
పైగా వాలియా పోస్ట్‌ను హార్దిక్, హార్దిక్ పోస్ట్‌ను వాలియా లైక్ చేసుకున్నారు. దీంతో ఆ ఇద్దరూ కలిసే గ్రీస్‌కు విహారయాత్రకు వెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఆ పోస్ట్‌కు మాత్రమే కాదు.. గతంలో కూడా వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు హార్దిక్ లైక్ కొట్టాడు. దీంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా మంది భావిస్తున్నారు.బ్రిటీష్ సింగర్, టెవీ పర్సనాల్టీగా జాస్మిన్‌కు గుర్తింపు ఉన్నది. బ్రిటీష్ రియాల్టీ టీవీ సిరీస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ లో నటించిన తర్వాత ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరో వైపు హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా ప్రస్తుతం సెర్బీయాలో ఉన్నది.