BRS | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి.. ఓటింగ్‌కు దూరంగా ఉండేలా నిర్ణయం?
BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలనే తీర్మానం బీఆర్ఎస్ సూత్రప్రాయంగా తీసుకుందని సమాచారం. రాజకీయంగా ఏ పక్షానికి మద్దతు ఇచ్చినా నష్టమేనన్న ఆలోచనతో ఈ తటస్థ వైఖరిని బీఆర్ఎస్ నేతలు ఎంచుకున్నట్లు చర్చ జరుగుతోంది.

#image_title
ఓటింగ్‌కు దూరంగా ఎందుకు?
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏ పార్టీకైనా మద్దతిచ్చిన కూడా, బీఆర్ఎస్‌కు రాజకీయంగా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందని పార్టీ నేతల అంచనా. ‘నోటా’ (None of the Above) అవకాశం ఈ ఎన్నికల్లో లేకపోవడం కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే నిర్ణయానికి కారణం.ఈసారి ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వడం, కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ వైరం దృష్ట్యా, బీఆర్ఎస్‌కు ఆచరణాత్మకంగా సాధ్యం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతోంది.
ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందని ప్రచారం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరికీ మద్దతు ఇచ్చిన ఇబ్బందులు తప్పవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్.