
#image_title
Bunny Vasu | మిత్రమండలి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ నేపథ్యంలో ఆయన భావోద్వేగంగా స్పందించారు. “మిత్రమండలి’ సినిమా బాగా వచ్చింది. దీపావళికి చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగల సినిమా ఇది అని అన్నారు. దర్శకుడు విజయేంద్ర చాలా మంచి మనసున్న వ్యక్తి అని తెలియజేశారు.
#image_title
ఫుల్ ఫైర్..
దర్శకుడు పరిశ్రమలో అందరూ బాగుండాలని, ఎదగాలని ఆయన కోరుకుంటాడు. భాను, కల్యాణ్ నిర్మాతలుగా మారడం కూడా చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇక ట్రోల్స్‌పై బన్నీ వాసు మాట్లాడుతూ.. “మా ట్రైలర్ కింద కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ నవ్వాలో చెప్పమంటున్నారు. సినిమా చూసి తర్వాత కామెంట్ చేయండి. మీరు సినిమా చూసి నవ్వకపోతే, అప్పుడు కామెంట్ పెట్టండి. అక్టోబర్ 16న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగానే ఆడాలని కోరుకుంటున్నాను,” అన్నారు.
తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ… “ఇండస్ట్రీలో అందరూ ఎదగాలి. ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది చిన్నపిల్లల మనస్తత్వం. మనం కష్టపడి ఎదగాలి. ఎవరో డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తే అది నడవదు. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను పడిపోవడం అంత ఈజీ కాదు. వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను కానీ తలమీదనే ఎందుకు పీకుతున్నానంటే అది నా సంస్కారం. నా జర్నీలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉంటా. ట్రోలింగ్ గురించి ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాను. ట్రోలింగ్ చేసేవాళ్లు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీలోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్‌గా మార్చి తిట్టడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ట్రోలింగ్ చేయించేవాళ్లు డబ్బులు ఇంకా ఉంచుకోండి అంటూ బన్నీ వాసు ఫైర్ అయ్యారు.
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
This website uses cookies.