Bunny Vasu | నా వెంట్రుక కూడా పీక‌లేరు.. బ‌న్నీ వాసుకి అంత కోపం ఎందుకు వ‌చ్చింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bunny Vasu | నా వెంట్రుక కూడా పీక‌లేరు.. బ‌న్నీ వాసుకి అంత కోపం ఎందుకు వ‌చ్చింది?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 October 2025,1:11 pm

Bunny Vasu | మిత్రమండలి  సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్‌ నేపథ్యంలో ఆయన భావోద్వేగంగా స్పందించారు. “మిత్రమండలి’ సినిమా బాగా వచ్చింది. దీపావళికి చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగల సినిమా ఇది అని అన్నారు. దర్శకుడు విజయేంద్ర చాలా మంచి మనసున్న వ్యక్తి అని తెలియ‌జేశారు.

#image_title

ఫుల్ ఫైర్..

ద‌ర్శ‌కుడు పరిశ్రమలో అందరూ బాగుండాలని, ఎదగాలని ఆయన కోరుకుంటాడు. భాను, కల్యాణ్ నిర్మాతలుగా మారడం కూడా చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇక ట్రోల్స్‌పై బన్నీ వాసు మాట్లాడుతూ.. “మా ట్రైలర్ కింద కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడ నవ్వాలో చెప్పమంటున్నారు. సినిమా చూసి తర్వాత కామెంట్ చేయండి. మీరు సినిమా చూసి నవ్వకపోతే, అప్పుడు కామెంట్ పెట్టండి. అక్టోబర్ 16న నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగానే ఆడాలని కోరుకుంటున్నాను,” అన్నారు.

తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ… “ఇండస్ట్రీలో అందరూ ఎదగాలి. ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది చిన్నపిల్లల మనస్తత్వం. మనం కష్టపడి ఎదగాలి. ఎవరో డబ్బులు పెట్టి ట్రోల్ చేస్తే అది నడవదు. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను పడిపోవడం అంత ఈజీ కాదు. వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను కానీ తలమీదనే ఎందుకు పీకుతున్నానంటే అది నా సంస్కారం. నా జర్నీలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉంటా. ట్రోలింగ్ గురించి ఆలోచిస్తే అక్కడే ఆగిపోతాను. ట్రోలింగ్ చేసేవాళ్లు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీలోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్‌గా మార్చి తిట్టడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ట్రోలింగ్ చేయించేవాళ్లు డబ్బులు ఇంకా ఉంచుకోండి అంటూ బ‌న్నీ వాసు ఫైర్ అయ్యారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది