Cab Driver | బ్యాంక్ నగదుతో క్యాబ్ డ్రైవర్ పరార్.. పెట్టెలో రూ. 25 లక్షల క్యాష్
Cab Driver | సికింద్రాబాద్ సిటీ యూనియన్ బ్యాంకు ప్రధాన శాఖ నుంచి బాలానగర్ బ్రాంచ్‌కు నగదు తీసుకెళ్తున్న సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ రూ. 25 లక్షల నగదు పెట్టెతో పరారయ్యాడు. ఈ ఘటన బుధవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
#image_title
ఏం జరిగింది?
బాలానగర్ సిటీ యూనియన్ బ్యాంక్‌కు చెందిన క్లర్క్ నర్సింగ్‌రావు మరియు సెక్యూరిటీ గార్డు నాగేశ్వర్, బుధవారం మధ్యాహ్నం నగదు తీసుకునేందుకు సికింద్రాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రూ. 25 లక్షల నగదుతో, TS10 UB 4911 నంబర్ గల క్యాబ్‌లో తిరిగి బాలానగర్ బ్రాంచ్‌కు బయలుదేరారు. అయితే బ్రాంచ్ వద్దకు చేరుకున్న తర్వాత, క్యాబ్ డ్రైవర్‌కి డబ్బులు చెల్లించే క్రమంలో… డ్రైవర్ డబ్బు పెట్టె తీసుకుని అక్కడి నుంచి కారుతో ఉడాయించాడు.
క్యాబ్ డ్రైవర్ పరారైన వెంటనే, సెక్యూరిటీ గార్డు నాగేశ్వర్ ఓ ఆటోలో ఆయనను బోయిన్‌పల్లి వరకు వెంబడించాడు. కానీ ఆ తర్వాత ఆ కారు కనిపించలేదు. వెంటనే బ్రాంచ్ మేనేజర్ సందీప్, బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ ఫుటేజ్ ప్రకారం, క్యాబ్ భారత్ లాడ్జ్ పక్కనున్న వీధి ద్వారా నవజీవన్‌నగర్ వైపు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి బాలానగర్ మెయిన్ రోడ్డుకు వెళ్లినట్టు గుర్తించారు.కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా, డ్రైవర్‌ను ఉస్మాన్ అలీగా గుర్తించారు. ఇతనికి గతంలో నేరచరిత్ర ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.