Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

 Authored By suma | The Telugu News | Updated on :13 January 2026,10:00 am

ప్రధానాంశాలు:

  •   Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 13 ఎపిసోడ్‌లో ఉత్కంఠ భరితంగా ఉంది. దాస్ చెప్పబోయే నిజం, కార్తీక్ వేసే కవర్, మరోవైపు కాశీ ఇంట్లో చెలరేగిన కలహం… మొత్తం ఎపిసోడ్ ప్రేక్షకులను చివరి నిమిషం వరకు కట్టిపడేసింది. ముఖ్యంగా జ్యోత్స్న అసలైన వారసురాలు కాదన్న నిజం బయటపడుతుందన్న భయం సుమిత్ర ఆరోగ్యం చుట్టూ తిరిగే భావోద్వేగాలు కథను మరింత గాఢంగా మార్చాయి.

Karthika Deepam 2 Today Episode: దాస్ నోట నిజం.. కార్తీక్ అడ్డుకట్ట

నేను మీకు ఒక ద్రోహం చేశాను అంటూ దాస్ కుటుంబం ముందు నిజం చెప్పేందుకు సిద్ధమవుతాడు. శివన్నారాయణ అడిగిన ప్రశ్నకు జ్యోత్స్న పేరు రావడంతో కార్తీక్, దశరథ ఇద్దరికీ గుండె ఆగినట్టవుతుంది. జ్యోత్స్న అసలైన వారసురాలు కాదన్న విషయం బయటపడితే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భయం వారిని వెంటాడుతుంది. దాస్ ఏదో కీలకమైన విషయం చెప్పబోతున్నాడని గ్రహించిన కార్తీక్ చాకచక్యంగా మాటల్ని మలుపుతిప్పి పరిస్థితిని కంట్రోల్ చేస్తాడు. కాశీకి బెయిల్ ఇప్పించడంలో జ్యోత్స్న సహాయం తీసుకున్నానని చెప్పిస్తూ దాస్ మాటలను కవర్ చేయడంతో ఆ క్షణానికి గండం గడుస్తుంది. శివన్నారాయణ కూడా పెద్ద మనసుతో తప్పు చేసినవాళ్లకైనా మంచే చేయాలి అంటూ కాశీని క్షమించే ధోరణి చూపిస్తాడు. ఈ పరిణామంతో జ్యోత్స్న, పారిజాతం ఊపిరి పీల్చుకుంటారు. అయితే నిజం పూర్తిగా దాచిపెట్టిన ఆనందం కంటే ఎప్పుడైనా బయటపడుతుందన్న భయం మాత్రం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

Karthika Deepam 2 Today Episode దాస్ నిజాన్ని పూర్తిగా బయటపెట్టబోతున్నాడా దీప అసలైన వారసురాలని కుటుంబం తెలుసుకుంటుందా

Karthika Deepam 2 Today Episode : దాస్ నిజాన్ని పూర్తిగా బయటపెట్టబోతున్నాడా?.. దీప అసలైన వారసురాలని కుటుంబం తెలుసుకుంటుందా?

Karthika Deepam 2 Today Episode:సుమిత్ర ఆరోగ్యం.. అసలైన వారసురాలు అవసరం?

దాస్, కార్తీక్ మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణ ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. సుమిత్రను బతికించాలంటే అసలైన కూతురు ఉండాల్సిందేనని అందుకే నిజం చెప్పాలనుకున్నానని దాస్ భావోద్వేగంగా చెబుతాడు. జ్యోత్స్న దశరథ కూతురు కాదన్న విషయం బయటపడితేనే బోన్‌మారో ట్రీట్‌మెంట్‌కు మార్గం సులభమవుతుందని అతని ఆలోచన. కానీ కార్తీక్ మాత్రం ఈ నిజాన్ని చెప్పడానికి సమయం సందర్భం రెండూ అవసరమని గట్టిగా నిలబడతాడు. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం ఇప్పటివరకు ఆమెకే తెలియదని అలాంటి పరిస్థితిలో మరో పెద్ద నిజాన్ని మోపడం ప్రమాదమని చెబుతాడు. బోన్‌మారో ట్రీట్‌మెంట్ దీపతోనే సాధ్యమన్నా ఇప్పుడే ఆమె అసలైన కూతురని ప్రకటించడం సరికాదని స్పష్టం చేస్తాడు. కార్తీక్ మాటల్ని అర్థం చేసుకున్న దాస్ తన తొందరపాటుకు క్షమాపణలు చెప్పి తాత్కాలికంగా తన తల్లికి అబద్ధం చెప్పి పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించుకుంటాడు. అయితే వీరి మాటలు విన్నట్టు కనిపించని జ్యోత్స్న పై నుంచి గమనిస్తూ మరింత అనుమానంలో పడుతుంది.

Karthika Deepam 2 Today Episode:కాశీ–స్వప్నల మధ్య విభేదాలు.. విడాకుల మాట

ఎపిసోడ్ రెండో భాగంలో కథ పూర్తిగా కాశీ ఇంటి వైపు మళ్లుతుంది. శ్రీధర్ బెయిల్ మీద కాశీని ఇంటికి తీసుకురాగానే స్వప్న ఆగ్రహంతో రగిలిపోతుంది. ఈ మనిషిని ఎందుకు విడుదల చేయించావు అంటూ భర్తపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కాశీ చేసినది కేవలం తప్పు కాదని అది మోసం, ద్రోహమని స్వప్న ఘాటుగా వ్యాఖ్యానిస్తుంది. ఎన్నిసార్లు క్షమించాలన్న ప్రశ్నకు ఆమె దగ్గర ఒక్కటే సమాధానం ఉంటుంది. విడాకులు ఇలాంటి మనిషితో నేను కలిసి బతకలేను అంటూ స్వప్న విడాకుల మాట అనగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్నతో చేతులు కలిపావన్న ఆరోపణలు మరింత మంటలు రాజేస్తాయి. కాశీ కూడా తాను చెప్పినట్టుగానే వెళ్లిపోతానని తన విలువ తర్వాత అర్థమవుతుందని ఆగ్రహంతో బయటకు వెళ్లిపోతాడు. స్వప్న కూడా మీరు క్షమించినా నేను క్షమించను అంటూ తేల్చిచెబుతుంది. ఇదిలా ఉండగా మరోవైపు దీప పుట్టింటికి వెళ్లాలని పట్టుబడుతుంది. కాంచన హెచ్చరించినా సుమిత్ర ఆరోగ్యం కోసం వెళ్లాల్సిందేనని దీప స్పష్టంగా చెబుతుంది. ఆమె నా కన్నతల్లి అన్న మాటతో దీప మనసులోని బాధ బయటపడుతుంది. ఈ మాటలు కాంచనకు మరింత అనుమానాలను కలిగిస్తాయి.  అమ్మకు ఆరోగ్యం బాలేదని తెలిసినప్పటి నుంచి ఆ ఇంట్లోవాళ్లు ఏం తినడం లేదు, తాగడం లేదని అంటుంది దీప. అన్నం పెట్టిన మనుషుల్ని, ఆశీర్వదించిన చేతుల్ని నేను మరిచిపోనని దీప చెబుతుంది.

Karthika Deepam 2 Today Episode:శౌర్య ప్రశ్నతో పూర్తయిన ఎపిసోడ్

ఇంట్లో అమ్మ ఏడుస్తుండటాన్ని గమనించిన శౌర్య కారణం అడుగుతుంది. రుణం తీర్చుకుంటానని అమ్మ చెప్పడంతో దాని అర్థం ఏమిటని ప్రశ్నిస్తుంది. అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసుకోవడమే నిజమైన రుణం తీర్చుకోవడమని కార్తీక్ వివరిస్తారు. దీనికి స్పందించిన శౌర్య ఈసారి ఉల్లిపాయలు కోసేప్పుడు సాయం చేసి తన రుణం తీరుస్తానని సరదాగా అంటుంది. ఈ మాటల్లో ఇంట్లో నవ్వులు పూయిస్తాయి. అయితే ఈ పోలిక దీపకి, సుమిత్ర వదినకి సరిపోదని కాంచన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. భావోద్వేగాలు, అభిప్రాయాల మధ్య ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ఇక జనవరి 13 ఎపిసోడ్‌లో నిజం బయటపడే అంచుల వరకు వచ్చి ఆగింది. రాబోయే ఎపిసోడ్‌ల్లో జ్యోత్స్న రహస్యం, సుమిత్ర ఆరోగ్యం, కాశీ–స్వప్నల బంధం ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది