Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: January 18, 2026, 3:59 pm
  •  Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఈ సినిమాతో మాత్రం తిరిగి సిక్సర్ కొడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.ఈ చిత్రానికి ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం Kishore Tirumala Direction వహించడంతో అంచనాలు మరింత పెరిగాయి. సెన్సిబుల్ ఎమోషన్స్, వినోదం, కుటుంబ కథనాన్ని తనదైన శైలిలో చూపించడంలో కిషోర్ తిరుమలకు ఉన్న పేరే ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది.
Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ రవితేజకు మళ్లీ బ్రేక్ ఇవ్వనున్నదా?

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.19 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత హైప్‌ను బట్టి చూస్తే, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సైలెంట్‌గా పూర్తయింది. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యే వరకు అసలు ఈ ప్రాజెక్ట్ ఉందన్న విషయమే చాలామందికి తెలియలేదు. అయితే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై నెమ్మదిగా బజ్ పెరిగింది. దానికి తోడు కిషోర్ తిరుమల దర్శకత్వం కావడంతో అంచనాలు మరింత బలపడ్డాయి.

సంక్రాంతి Telugu Movies Sankranthi 2026 కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 22 నిమిషాలు మాత్రమే ఉండటం కూడా ప్లస్ పాయింట్‌గా మారింది. ఎక్కువ లాగుడు లేకుండా కథను చెప్పే ప్రయత్నం చేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ‘ధమాకా’ వంటి భారీ హిట్‌కు సంగీతం అందించిన భీమ్స్, ‘మాస్ జాతర’ తర్వాత రవితేజతో మరోసారి పని చేయడం విశేషం. ఈ సినిమాతో భీమ్స్‌కు హ్యాట్రిక్ హిట్ దక్కుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో ఉంది. హీరోయిన్‌లుగా డింపుల్ హయతి, అషీకా రంగనాథ్ నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎనర్జీ, కిషోర్ తిరుమల మార్క్ భావోద్వేగాలు, వినోదం పుష్కలంగా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Bhartha Mahasayulaki Wignyapthi Movie Live Updates : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ

క‌థ‌:

రామ సత్యనారాయణ (రవితేజ) ‘అనార్కలి’ పేరుతో వైన్ బిజినెస్ నిర్వహిస్తుంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పెయిన్‌లో ఉన్న మానస (ఆషికా రంగనాథ్)కు చెందిన ప్రముఖ వైన్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆమె నుంచి నిరాశాజనకమైన రిజెక్షన్ ఎదురవుతుంది. కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో రామ సత్యనారాయణ స్పెయిన్‌కు వెళ్తాడు. అక్కడ మానసకు నేరుగా తన అసలు గుర్తింపును చెప్పకుండా, ఇండైరెక్ట్‌గా ఆమెకు దగ్గరవుతాడు. తనది కాకుండా మరో బ్రాండ్‌గా చూపిస్తూ ‘అనార్కలి’ వైన్ రుచిని ఆమెకు పరిచయం చేస్తాడు. ఆ వైన్‌ను ప్రమోట్ చేయాలని ఆమెను ఒప్పిస్తాడు. ఇదే సమయంలో మానస అసిస్టెంట్‌ (సత్య) చేసిన మోసాన్ని తెలివిగా ఆమెకు తెలియజేసి, మానస నమ్మకాన్ని సంపాదిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, భావోద్వేగాల పరంగా దగ్గరవుతారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో రామ సత్యనారాయణ తనకు ఇప్పటికే బాలామణి (డింపుల్ హయతి)తో పెళ్లి అయ్యిందన్న నిజాన్ని దాచిపెడతాడు. స్పెయిన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగివచ్చాక, భార్యతో సాధారణ కుటుంబ జీవితం కొనసాగిస్తుంటాడు. ఇదే సమయంలో అనుకోని విధంగా మానస హైదరాబాద్‌కు రావడం కథలో కీలక మలుపు. వైన్ ఫెస్టివల్‌లో ఇద్దరూ మళ్లీ కలుస్తారు. ఈ విషయం భార్యకు తెలిసితే పెద్ద సమస్య అవుతుందని భావించిన రామ సత్యనారాయణ, పరిస్థితిని చాకచక్యంగా మ్యానేజ్ చేస్తూ వస్తాడు. కానీ మానస మాత్రం అతడిని తరచూ కలవాలని ఒత్తిడి చేస్తుంటుంది. అంతేకాదు ‘అనార్కలి’ వైన్ అసలు ఓనర్‌ను కలవాలన్న కోరిక వ్యక్తం చేస్తుంది.

దీంతో ఇక నిజం దాచడం సాధ్యం కాదని గ్రహించిన రామ సత్యనారాయణ, చివరికి మానసకు అసలు నిజం చెబుతాడు. అప్పుడు మానస ఎలా స్పందించింది? ఆమె బాలామణిని ఎందుకు కలిసింది? మానస విషయం భార్యకు తెలియకుండా రామ సత్యనారాయణ ఎలా పరిస్థితులను హ్యాండిల్ చేశాడు? ఇద్దరి మధ్య ఇరుక్కుని అతడు ఎలా నలిగిపోయాడు? అన్నదే మిగతా సినిమా కథ.

విశ్లేషణ:

సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకే ప్రేక్షకుల మద్దతు ఉంటుందన్న నమ్మకంతో మేకర్స్ వరుసగా అదే జానర్‌లో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలోనే మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా విడుదలైంది. భార్యాభర్తల మధ్య గొడవలు, లవ్ ట్రయాంగిల్, వాటిని మ్యానేజ్ చేస్తూ హీరో పడే ఇబ్బందుల చుట్టూ తిరిగే ఈ సినిమా, బలమైన కథ కంటే పూర్తిగా వినోదంపైనే ఆధారపడింది.

దర్శకుడు కిషోర్ తిరుమల కథలో కొత్తదనం చూపించకపోయినా, సందర్భానుసారంగా కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. స్పెయిన్ ఎపిసోడ్స్, రవితేజ–సత్య కామెడీ, హైదరాబాద్‌లో భార్య–భర్తల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. వెన్నెల కిషోర్, సునీల్ పాత్రలు హైలైట్‌గా నిలిచాయి. సెకండాఫ్‌లో హీరో రెండు వైపులా నలిగిపోవడం చుట్టూ కథ సాగినా, ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గలేదు. మొత్తంగా పండగకు సరిపడే కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓ లైట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp