ఈటలతో పాటు మరో ముగ్గురు మంత్రులకు ఔట్.. కేబినేట్ లోకి ఈ ముగ్గురు..?
Telangana Cabinet : తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఆయన్ను ఉన్నపళంగా మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద కుదుపు ఏర్పడింది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోంది అనేది మాత్రం స్పష్టం అయింది. సీఎం కేసీఆర్ చాలారోజుల నుంచి ఈటల రాజేందర్ పై కన్నేశారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ.. ఆయన రియాక్షన్ ఇలా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం వెంటనే చకచకా ఆయనపై విచారణకు ఆదేశాలు రావడం.. ఆయన మంత్రిత్వ శాఖను బదిలీ చేయడం, ఆ తర్వాత ఏకంగా ఆయన్ను మంత్రి వర్గం నుంచే తీసేయడం.. ఇవన్నీ చూస్తుంటే.. దీని వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారు.. అనే విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థం అయింది.
అయితే.. సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టింది ఒక్క ఈటల రాజేందర్ మీదనే కాదట. నిజానికి కేబినేట్ ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారట. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం కేసీఆర్ కొందరు మంత్రులను ఉద్వాసన పలకడంతో పాటు కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే ముందుగా ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ పని అయిపోయింది. ఇక నెక్స్ ట్ సీఎం కేసీఆర్ ఫోకస్ మరో ముగ్గురు మంత్రుల మీదికి వెళ్లిందట. మరో ముగ్గురు మంత్రులను కూడా మంత్రివర్గం నుంచి త్వరలోనే సీఎం కేసీఆర్ తొలగించనున్నారట. వాళ్లు ఎవరు అనేదానిపై మీడియాలో కథనాలు వస్తున్నా… నిజంగా వాళ్లకే కేసీఆర్ ఉద్వాసన పలుకుతారా? లేక ఇంకా వేరే మంత్రులు ఉన్నారా? అనేది మాత్రం తెలియదు. మొత్తానికి నలుగురు మంత్రులకు చెక్ పెట్టి.. వాళ్ల స్థానంలో కొత్త మంత్రులను తీసుకోవాలనేది సీఎం కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు.
Telangana Cabinet : పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా చాన్స్?
అయితే… నలుగురు మంత్రుల స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే… ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అలాగే… వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. ఇక.. అలాగే.. తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు కూడా మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద మరో నలుగురికి అవకాశం ఇవ్వడం కోసం… మంత్రివర్గంలో ఉన్న నలుగురికి సీఎం కేసీఆర్ ఉద్వాసన పలుకుతున్నట్టు తెలుస్తోంది.