Driving Licence : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్.. అప్లికేషన్ పోందవచ్చు
Driving licence : డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇన్ని రోజులు ఆఫీసుల ఎదుట గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చేది. ఎండలో లైన్లలో నిలబడలేక.. బ్రోకర్లు, కార్యాల యాలలోని సిబ్బందికి లంచాలు ఇచ్చి తమ పనులు చేయించుకునేవారు. అయితే ఈ కష్టాలు ఇప్పుడు స్వస్తి పలకండి. వాహన వినియోగదారులకు కేంద్రం ఇప్పుడో శుభవార్త చెప్పింది. వాహనదారులకు రాబోయే రోజుల్లో మెరుగైన విధంగా సేవలు అందించేందుకు… డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ పద్దతిలో కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్సు అప్లై చేసుకోవచ్చు.
ఇంటినుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు.. కేంద్రం తెచ్చిన పరివాహన్ అనే ఈ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ నేమ్ పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అప్షన్ ఓకే చేయాలి. ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పలు రకాల సేవలు మనకు అందుబాటులో కనిపిస్తాయి. అందులో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎన్నో రకాల సేవలు లభిస్తాయిడ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ లాంటి రకాల చిన్నచిన్న సేవల కోసం
Driving licence : డ్రైవింగ్ లైసెన్స్ ఇంటినుంచే ఇలా..:
రవాణా కార్యాలయాలలో గంటల కొద్దీ వేచి ఉండే విధానానికి దీంతో విముక్తి లభించనుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేష న్, ఆర్‌సీలో పేరు మార్పు, మాటిగేజ్‌ను తొలగించు కోవడం, చిరునామా మార్చుకోవడం, అంతర్జా తీయ డ్రైవింగ్ లైసెన్సు పొందడం లాంటి వాటి 15 సేవల కోసం ఆధార్ నంబర్ నమోదు చేసుకుని ఇంటి నుంచే రవాణా శాఖ సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. అయితే సేవలు పొందే వ్యక్తి తప్పనిసరిగా తన ఆధా ర్ నంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. ఆధార్ వెరిఫికేషన్ అమలు వల్ల నకిలీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని తొందరగా గుర్తించేందుకు వీలుంటుందని అంటున్నారు. అలాగే బ్రోకర్లకు కూడా దీని వల్ల చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.