Employees : ఉద్యోగులకు కేంద్రం తీపికబురు.. కొత్త ఏడాది భారీగా పెరగనున్న జీతం.. ఎంతంటే..?
Employees : కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఉద్యోగుల బేసిక్ శాలరీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.26 వేలకు పెరగ వచ్చునని భావిస్తున్నారు.
దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే.. బడ్జెట్ కన్నా ముందుగానే అనగా కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి. ఉద్యోగులు చాలా కాలం నుంచి ఫిట్‌మెంట్ పెరుగుదలకై డిమాండ్ చేస్తున్నారు. 2.57 శాతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను చివరిగా 2016లో పెంచారు. అప్పుడు ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ రూ.6 వేల నుంచి రూ.18 వేలకు చేరింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫిట్‌మెంట్ ను మరోసారి పెంచితే..
ఈ మినిమమ్ బేసిక్ పే రూ.26 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు చాలా మేలు కలుగనుంది. అయితే కేంద్రం నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.