Union Budget 2022 : బ్రేకింగ్.. మానసిక రోగులకు ఇళ్లకే మందులు, కేంద్రం కొత్త పథకం…!
Union Budget 2022 : కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమందికి మానసిక రుగ్మతలు ఉత్పన్నమయ్యాయని వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూపకల్పన చేస్తున్నట్టుగా ఆమె కీలక ప్రకటన చేసారు. బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుందని తెలిపారు. 5.7 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందిస్తామని అన్నారు.
మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్‌వాడీల రూపకల్పన చేస్తున్నట్టుగా ప్రకటించారు. గత రెండేళ్లలో నల్‌సే జల్ కింద 5.7కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు వచ్చిందని అన్నారు. పీఎం ఆవాస యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు స్థాపిస్తామని పేర్కొన్నారు.