Nirmala Sitharaman : రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షలు.. పథకంపై కేంద్రం క్లారిటీ..!
ప్రధానాంశాలు:
నిర్మలా సీతారామన్ పేరుతో ఫేక్ ప్రచారం
Nirmala Sitharaman : రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షలు.. పథకంపై కేంద్రం క్లారిటీ..!
Nirmala Sitharaman : సోషల్ మీడియాలో Social Media ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఒక ఫేక్ వీడియో వైరల్ Viral Video అవుతోంది. ఈ వీడియోలో ఆమె రూ.21,000 పెట్టుబడితో నెలకు రూ.15 లక్షల ఆదాయం వచ్చే పెట్టుబడి పథకాన్ని ప్రోమోట్ చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సహకారంతో ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టు కల్పించి చూపించారు. నిర్మలా సీతారామన్ గాత్రాన్ని అనుకరించిన డీప్‌ఫేక్ టెక్నాలజీ ఈ మోసానికి ఆధారంగా నిలిచింది. దీనిని నమ్మిన కొందరు ప్రజలు వాట్సాప్ స్టేటస్‌లు, షేర్‌లు చేస్తూ మరింతగా ప్రచారం చేస్తున్నారు.

Nirmala Sitharaman : రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షలు.. పథకంపై కేంద్రం క్లారిటీ..!
Nirmala Sitharaman కేంద్ర పథకం.. రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షల వరకు ఆదాయం.. పచ్చి అబద్దం
ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ఇది పూర్తిగా నకిలీదేనని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తన అధికారిక ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ వార్తను ఖండించింది. నిర్మలా సీతారామన్ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి పెట్టుబడి పథకాన్ని ప్రకటించలేదని స్పష్టంగా ప్రకటించింది. ఈ వీడియోను నమ్మకూడదని, ఇలాంటి మోసపూరిత ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇప్పుడు డీప్‌ఫేక్ వీడియోలు సామాన్య ప్రజల విశ్వాసాన్ని దోచుకునే ఆయుధాలుగా మారుతున్నాయి. అందువల్ల ప్రజలు ప్రభుత్వ పథకాలపై గూడ్డిగా నమ్మకుండా, అధికారిక వెబ్‌సైట్లు లేదా పీఐబీ వంటి ప్రామాణిక వేదికల ద్వారా ధృవీకరణ చేసుకోవాలి. ఇలాంటి మోసాల వల్ల ప్రజలు డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. టెక్నాలజీ వృద్ధి అయిన నేటి రోజుల్లో మోసపూరిత సమాచారం నుండి కాపాడుకోవాలంటే ఇలాంటి ఫేక్ న్యూస్ ను అస్సలు నమ్మకూడదు.