New Schemes : పేద ప్రజల కోసం కేంద్రం సరికొత్త పథకాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..!
New Schemes : వెనకబడిన పేద ప్రజల కోసమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. వారికి రకరకాల స్కీంస్ తో చేయూత అందిస్తారు. ఐతే కేంద్రం ఇప్పుడు కొత్తగా పేద ప్రజల కోసం కొన్ని కొత్త పథకాలను తీసుకొచ్చింది. ఏ పథకాన్ని ఎవరు వినియోగించుకోవచ్చు.. ఎలా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం.
New Schemes : ఇందిలో మొదటిది పీఎం విశ్వకర్మ యోజన..
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను అమలులోకి తెచ్చింది. పేద ప్రజలకు సాయం చేసేక్లా వారి స్వాలంబన చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చేతి వృత్తి దారులు, కార్మికుల కోసం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. స్వర్ణకారులు, చేనేత కార్మీకులు, తాపీ మేస్త్రీలు, శిల్పులు, బుట్టల తయారీ దారులు, చెప్పుకు కుట్టుకునే వారు సవితా సమాజ్ దావర్ వంటి కొన్ని వర్గాల ప్రజలు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఐతే సుమారు 30 లక్షల ఫ్యామిలీలు 5% రాయితీ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం అందిస్తారు.
అంతేకాదు వీరిలో మహిళలకు మహిళా సమ్నాన్ పొదుపు పథకం అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఆడబిడ్డ నిధి, మహా శక్తి యోజన తో పాటుగా కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ద్వారా కూడా వారికి సహాయం అందించే అవకాశం ఉంది. పథకం ద్వారా మహిళలకు 7.5 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు అకౌంట్ తెరచిన ఏడాదిలో డిపాజిట్ లో 40 శాతం వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనితో పాటుగా ప్రధాన మంత్రి ప్రాణం పథకం కూడా వ్యవసాయ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తుంది. ఎరువులను సబ్సీడీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.