7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి రూ.2 లక్షలు డీఏ బకాయిలు.. నిర్ణ‌యం ఎప్పుడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి రూ.2 లక్షలు డీఏ బకాయిలు.. నిర్ణ‌యం ఎప్పుడో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 January 2022,6:30 pm

7th Pay Commission : 7వ వేతన సంఘంకి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కి త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెప్ప‌నుంద‌ని తెలుస్తుంది. డీఏ పెంపు సహా మరో రెండు నిర్ణయాలు త్వరలో తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 31 శాతం డీఏ పొందుతున్నారు. మరో 3 శాతం డీఏ పెరగనుందని అంచనా.2022 జనవరికి సంబంధించిన డీఏ ఇది కాగా, డీఏ 3 శాతం పెరిగితే ఇక ఉద్యోగులకు 34 శాతం డీఏ లభించనుంది.

డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు ఉద్యోగులకు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది.2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం చొప్పున హౌజ్ రెంట్ అలవెన్స్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉద్యోగులకు డీఏ పెరిగితే అందుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

central govt employees to get rs 2 lakh as 18 months

central govt employees to get rs 2 lakh as 18 months

7th Pay Commission : త్వ‌ర‌లోనే శుభ‌వార్త‌..

డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ కానున్నాయి.లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు విడుదలవుతాయి. దీనిపై కేబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యయ శాఖ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, దాదాపు 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది