YS Jagan : జగన్ ప్రభుత్వం నెత్తిన పాలు పోసిన కేంద్ర ప్రభుత్వం – బ్లాక్ బస్తర్ గుడ్ న్యూస్..!
YS Jagan : ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే.. ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ తీసుకోవాల్సిందే. రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా.. నిధుల పరంగా.. ఇతర విషయాల పరంగా ఖచ్చితంగా కేంద్రం అవసరం ఉంటుంది. కేంద్రం సాయం తీసుకోవాల్సిందే. లేదంటే రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అయితే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రం మాట వినవు. నువ్వెంత.. నీ లెక్కెంత అన్న చందంగా ఉంటాయి. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం..
కేంద్రానికి తొలి నుంచి మద్దతు పలుకుతోంది. పలు ఎన్నికల్లోనూ కేంద్రానికి మద్దతు ప్రకటించింది వైసీపీ. అయితే.. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 న ఢిల్లీలో వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో ఏపీ నుంచి ఒక శకటాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాల నుంచి 23 శకటాలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీ నుంచి కోనసీమకు చెందిన ప్రభల తీర్థం శకటాన్ని కేంద్రం ఎంపిక చేసింది.
YS Jagan : ఢిల్లీలో ప్రదర్శించనున్న కోనసీమ ప్రభల తీర్థం శకటం
అయితే.. కోనసీమకు చెందిన ఈ ప్రభల తీర్థానికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రను దేశానికి చాటడం కోసమే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరం కనుమ రోజున కోనసీమ ప్రభలను కోనసీమ జిల్లాలో ఉన్న 120 గ్రామాల్లో ఊరేగిస్తారు. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రభలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. అయితే.. ఏపీ నుంచి గణతంత్ర వేడుకల కోసం శకటాన్ని ఎంపిక చేయడంపై వైసీపీ పార్టీ హర్హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోనసీమ ప్రభలతీర్థం ఎంపిక కావడం గర్వ కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.