Teacher Jobs : నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జాబ్స్ లేక చాలా మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందనే చెప్పాలి. దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలకు పైగా, నవోదయ స్కూళ్లలో 3 వేలకు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారని పేర్కొన్నది.
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భారతదేశంలో మొత్తం 1,247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో 2019లో 5,562 ఖాళీలు ఉంటే, 2020 నాటికి ఖాళీల సంఖ్య పెరిగి 8,055 కి చేరుకుంది. 2021లో ఈ ఖాళీల సంఖ్య 10,452 కి చేరగా, ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 12,044 ఖాళీలు ఉన్నాయి. అంటే 2019 నుంచి ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్ పోస్టులు, 1,332 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . వీటిలో తమిళనాడులో 1,162, మధ్యప్రదేశ్‌లో 1,066, కర్ణాటకలో 1,066 అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,156 పోస్టుల్లో జార్ఖండ్‌లో అత్యధికంగా 230 ఉన్నాయని మంత్రి చెప్పారు. బదిలీలు, పదవీ విరమణల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. భర్తీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో 69, ఆంధ్రప్రదేశ్‌లో 106 పోస్టులున్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. ఉపాధ్యాయుల పదవీ విరమణతో పాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం లాంటి అనేక కారణాల వల్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపారు. బోధన, అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో తాత్కాలిక కాల వ్యవధి కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల్ని భర్తీ చేస్తున్నామన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.