Nara Lokesh : వైఎస్ జగన్ ను ఢీ కొట్టాలంటే నారా లోకేష్ ఆ పని మానేయాలి.. చేయాల్సింది ఏంటో తెలుసా?
Nara Lokesh : ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని తెలుగు దేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. తమకు చెందిన మీడియా, తమకు అనుకూలంగా రాసే మీడియాలో తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ప్రమోషన్ ను చేసుకుంటూ ఉంటున్నారు. కాని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాని ఆయన తనయుడు లోకేష్ కాని ఇతర తెలుగు దేశం పార్టీ నాయకులు కాని ప్రజల్లోకి వెళ్లడం లేదు అనేది విమర్శ. ప్రజల్లోకి వెళ్లకుండా గతంలో ఎవరు అధికారం దక్కించుకున్న దాఖలాలు లేవు. గతంలో రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా అంతా కూడా అధికారం దక్కించుకునేందుకు జనాల్లోకి వెళ్లారు.
Nara Lokesh : నారా లోకేష్ ప్రజల్లో కంటే పబ్లిసిటీకే…
తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మొదటి నుండి కూడా జనాల్లో ఎక్కువ ఉండటం కంటే పబ్లిసిటీ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఎక్కువగా మీడియాలో కనిపించేందుకు ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఇప్పటికి కూడా ఆయన జనాల్లోకి వెళ్లేందుకు సిద్దంగా లేడు అనడంలో సందేహం లేదు. అలాంటి నారా లోకేష్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించి తీరుతామంటూ ఆయన బీరాలు పలుకుతున్నాడు. ఆయన మాటలు చూస్తుంటే విడ్డూరంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మీడియాతో జగన్ ను ఢీ కొట్టడం సాధ్యమా..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పదే పదే మీడియాలో విమర్శిస్తూ నారా లోకేష్ జనాల్లో పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా ఎంత వరకు సాధ్యం అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజల్లో ఆయన గురించి ఉన్న అభిమానం మరియు అభిప్రాయంను దెబ్బ తీయడం ఎవరి వల్ల కాదంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నారా లోకేష్ జనాల్లోకి వెళ్లి ప్రజా వ్యతిరేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని నిరూపిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఏమైనా తెలుగు దేశం పార్టీ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.