
rashmika mandanna is ready for doing a special song Samantha
samantha అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక చిత్రం నుంచి ఇటీవల రిలీజైన సమంత ఐటం సాంగ్ “ఊ అంటావా మామా ఊఊ అంటావా” పాట ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ పాటకు లిరిక్స్ అందించిన రైటర్ చంద్రబోస్ ఈవెంట్ లో అందరిముందు స్టేజీ మీదే సమంతపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వేదిక మీదకు వచ్చిన చంద్రబోస్ పై పుష్ప సినిమాలోని పాటల లిరిక్స్ చెబుతూ అభిమానుల్లో హూషారెత్తించారు. ఇక ఐటెం సాంగ్ ఉ అంటావా మావ ఉఊ అంటావా మావ పాట గురించి మాట్లాడుతూ… ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ 4 స్వరాలతో స్వరపర్చారని చెప్పారు. గతంలో ఇళయరాజా గారు మూడు స్వరాలతో స్వరపర్చితే ఇప్పుడు దేవి శ్రీ నాలుగు స్వరాలతో తమను అబ్బురపరిచారని పేర్కొన్నారు. సంగీత చరిత్రలో ఇదొక గొప్ప ప్రయోగమని చెప్పుకొచ్చారు. సాంగ్ లో నటించిన సామ్.. ఎంతో అందంగా అభినయించి పాటకు మరింత అందాన్ని తెచ్చిందన్నారు. ఆ మేరకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Chandra bose comments on samantha item song in pushpa Movie
అంతటితో ఆగకుండా సమంత అంటే ఎవరో కాదు మన రామలక్ష్మి అంటూ పొగిడేశారు చంద్రబోస్. సమంత… సౌందర్యవతి, సౌశీల్యవతి అని ప్రశంసల్లో ముంచెత్తారు. బన్నీ ప్రేమ, అభిమానం లేకుంటే ఈ సినిమాలో ఇన్ని పాటలు రాసేవాడిని కాదని అన్నారు చంద్రబోస్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తుండగా.. విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.