Chandrababu : పార్టీ లేదు బొక్క లేదు అని ఓపెన్ గా ఒప్పేసుకున్న చంద్రబాబు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : పార్టీ లేదు బొక్క లేదు అని ఓపెన్ గా ఒప్పేసుకున్న చంద్రబాబు?

Chandrababu : ఆ పార్టీ లేదు.. బొక్కా లేదు.. అంటూ ఒకప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు చెప్పిన విషయాలు గుర్తున్నాయా? ఆయన అన్న మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అవే మాటలను ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబే అంగీకరించారు. అవును.. అసలు టీడీపీ పరిస్థితి ఏంటో.. ఎవ్వరికీ తెలియడం లేదు. చివరకు చంద్రబాబుకు కూడా అంతుపట్టడం లేదు. పార్టీ పరిస్థితిపై ఆయనకు ఏం అర్థం కావడం లేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఎంత చేస్తున్నా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 December 2022,4:40 pm

Chandrababu : ఆ పార్టీ లేదు.. బొక్కా లేదు.. అంటూ ఒకప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు చెప్పిన విషయాలు గుర్తున్నాయా? ఆయన అన్న మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అవే మాటలను ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబే అంగీకరించారు. అవును.. అసలు టీడీపీ పరిస్థితి ఏంటో.. ఎవ్వరికీ తెలియడం లేదు. చివరకు చంద్రబాబుకు కూడా అంతుపట్టడం లేదు. పార్టీ పరిస్థితిపై ఆయనకు ఏం అర్థం కావడం లేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఎంత చేస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడటం లేదు.

ఓవైపు చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నా కూడా ఫలితం లేదు. ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జనాల్లో తిరుగుతున్నా ఎందుకు పార్టీని ఆదరించడం లేదనే టెన్షన్ చంద్రబాబుకు ఎక్కువైందట. ఇటీవల సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఇదే విషయాన్ని ప్రస్తావించారట. రోజు రోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. నేతలు కూడా ఆటిట్యూడ్ మార్చుకోవాలని..

Chandrababu accepts tdp position in ap

Chandrababu accepts tdp position in ap

Chandrababu : నేతలకూ క్లాస్ పీకిన చంద్రబాబు

లేదంటే పార్టీకి భవిష్యత్ కష్టమని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో నేతలంతా పోరాటాలు చేయాలని చంద్రబాబు స్పష్ట చేశారట. నేతలందరికీ చంద్రబాబు క్లాస్ పీకిన తాలుకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలవకపోతే ఇక టీడీపీ పరిస్థితి అగమ్యగోచరమే. పార్టీ భవిష్యత్తే అంధకారంలోకి వెళ్లడంతో పాటు తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారనుందని చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది