ChandraBabu : వైఎస్ జగన్ కి చంద్రబాబు బిగ్ ఛాలెంజ్.. 175 సీట్లు గెలవడం కంటే పెద్ద ఛాలెంజ్ ఇది
ChandraBabu : ఇది కదా అసలు సిసలైన సవాల్ అంటే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బస్తీ మే సవాల్ అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ హస్తగతం చేసుకుంటుందని బీరాలు పలుకుతున్నారు కానీ.. ముందు నీ సొంత నియోజకవర్గం పులివెందులలో గెలిచి చూపించు అని సీఎం జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు.
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో చంద్రబాబు తాజాగా పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా కుప్పం పర్యటనకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వేరే పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు వేరే పార్టీ వాళ్లు అటువైపు రావద్దనే ఇంగిత జ్ఞానం కూడా లేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇటీవల గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.
Chandrababu : గోరంట్ల మాధవ్ వీడియోపై చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు
ఆ వీడియో అంత సంచలనం సృష్టిస్తే సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదు. మాధవ్ పై చర్యలు తీసుకునే ధైర్యం జగన్ కు లేదా? జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు.. అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఒక పరిశ్రమ అయినా వచ్చిందా. ఒక్క ఉద్యోగం అయినా జగన్ ఇచ్చారా? అసలు ఏపీలో ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.. అంటూ దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. టీడీపీపై జనాల్లో తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. టీడీపీ ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తుంది. అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తామంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు.