Bhuvaneshwari : తెరపైకి భువనేశ్వరి.. చంద్రబాబు భావోద్వేగం.. చివరికి ఏమయ్యేనో?
Bhuvaneshwari : తెలుగు వారి ఆరాధ్య నటుడు, తెలుగు భాషకు గౌరవం తెచ్చిన రాజకీయ నాయకుడు, తెలుగు వారు అప్యాయంగా పిలుచుకునే అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ తనయ.. మాజీ సీఎం, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రాబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటూ బిజినెస్ ఉమన్‌గా భువనేశ్వరి పేరు తెచ్చుకున్నారు. కాగా, తాజా ఘటనలతో భువనేశ్వరి పేరు రాజకీయాల్లో బాగా వినబడుతోంది.
ఏపీ రాజకీయాల్లో భువనేశ్వరి కేంద్ర బిందువైంది. తనకు జరిగిన అవమానం నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రాబు శపథం చేశారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్‌లో తన భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానాలు చేశారని చంద్రబాబు మీడియా సాక్షిగా వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే, నారాభువనేశ్వరిని రాజకీయ రచ్చలోకి తీసుకురావడంలో అధికార వైసీపీ కారణమైందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. కానీ, టీడీపీ కూడా ఒక కారణమవుతున్నదని కొందరు విమర్శిస్తున్నారు.
Bhuvaneshwari : భార్య భువనేశ్వరిని తలుచుకుని చంద్రబాబు ఎమోషనల్..
నారా భువనేశ్వరి విషయం వైసీపీ వారు ప్రస్తావించారో లేదో కానీ, టీడీపీ శ్రేణులు ఈ విషయంలో సీరియస్‌గా స్పందించాయని, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందన ఊహించని విధంగా వచ్చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో అంబటి రాంబాబు మాధవరెడ్డి పేరు ప్రస్తావిస్తూ వెటకారం చేశారని, అయితే, తను వ్యక్తిగత రక్షణ నేపథ్యంలో విమర్శ చేశాడు. కాగా, వాటిని పరోక్ష వ్యాఖ్యలుగా భావించి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనేశ్వరి గురించి తనకు తానుగా అన్వయించుకుని చంద్రబాబు తీవ్ర నిర్ణయం తీసుకున్నారేమోనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తాము భువనేశ్వరి గురించి ఎక్కడ మాట్లాడామో చూపించాలని సీఎం జగన్, అంబటి రాంబాబు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అడుగుతున్నారు. సానుభూతి కోసం చంద్రబాబు ఆయన భార్య పేరును వాడుతున్నారని ఈ క్రమంలోనే వైసీపీ నేత నాని విమర్శిస్తున్నారు.