Chandrababu : ఈ ప్రాతిపదికన చంద్రబాబు క్యాండిడేట్ లని సెలక్ట్ చేయబోతున్నారా.. !
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలనీ చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది. ఇటీవల కర్నూలు పర్యటనలో ప్రజలు గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్తా.. లేకపోతే ఇదే నాకు చివరి ఎన్నికలు అని ఓపెన్ గానే ప్రకటించేశారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల విషయంలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువతకు పెద్దపీట వేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై “బాదుడే బాదుడు” ఇంకా “ఇదేం కర్మరా” అనే నిరసన కార్యక్రమాలతో ప్రజలలో బలంగా వెళుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే నారా లోకేష్ జనవరి 27వ తారీకు నుండి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో వచ్చే ఎన్నికలకు చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ హిస్టరీలో ఎన్నడూ తీసుకోలేని సరికొత్త నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే ఈప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ చంద్రబాబు టికెట్ కన్ఫామ్ చేయడం తెలిసిందే. ఇదే సమయంలో మరో 20 మందిని కూడా ఫైనల్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎన్నికలకు సంవత్సరం ముందే చంద్రబాబు ఈ రీతిగా అభ్యర్థులను ముందే ప్రకటించడం వెనకాల ఒక ప్రాతిపదిక ఉన్నట్లు టీడీపీలో సరికొత్త టాక్ నడుస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ముందుగానే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడం వల్ల.. లోకేష్ పాదయాత్రకి ఎటువంటి అడ్డంకులు ఉండవని..ప్లాన్ చేయడం జరిగిందట. పాదయాత్ర నేపథ్యంలో నియోజకవర్గాల భారీ ఖర్చులు కూడా సదరు నేతలు పెట్టుకుంటారని.. ఈ ప్రాతిపదికన చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.