వైసీపీ విజయం చూసి పిచ్చి పట్టిందా..?.. ఇవేమి మాటలు చంద్రన్న
chandrababu : ఏపీలో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తమ సమీప అభ్యర్థిని టీడీపీ నేత పనబాక లక్ష్మిపై 2,71,592 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2019 లో వచ్చిన మెజారిటీ కంటే 40 వేల ఓట్లు ఎక్కువగా సాధించింది వైసీపీ పార్టీ. దీనిని బట్టి చూస్తే జగన్ పనితీరును ప్రజలు మెచ్చుకున్నట్లే లెక్కని విశ్లేషకులు చెపుతున్న మాట. అయితే ఇది సరైన విజయం కాదని, వైసీపీ నేతల అహాన్ని అణచివేసే విజయమని, తిరుపతి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని చంద్రబాబు chandrababu తన ధోరణిలో ప్రసంగం ఇచ్చాడు.
చంద్రబాబు ఏమన్నాడో ఆయన మాటల్లో విందాం..
వైసీపీ నేతల అహాన్ని అణచిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు ధన్యవాదాలు
★ వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు.
★ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైసీపీ నేతల అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు.
★ వైసీపీ అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన టీడీపీ కార్యకర్తలను, నాయకులను అభినందిస్తున్నా.
★ తిరుపతి ఉపఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది.
★ అరాచకాలు, అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న వైసీపీ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తల తెగువ స్ఫూర్తిదాయకం.
★ ఐదు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అహంభావంతో వ్యవహరించిన వైసీపీ శ్రేణులకు ఓటుతో బుద్ధి చెప్పిన తిరుపతి లోక్ సభ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నా.
బాబు మాటలను గమనిస్తే తాము ఓడిపోయామనే బాధ కంటే కూడా హమ్మయ్య వైసీపీ కి పెద్ద మెజారిటీ రాలేదులే అనే సంతోషం కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పినట్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత వలనే ఓటింగ్ శాతం తగ్గిందని అనుకుందాం. మరి టీడీపీ మీద సానుభూతి పెరిగిందా..? పెరిగితే గతంలో కంటే ఎక్కువ ఓట్లు రావాలి కదా…? లేకపోతే గతంలో వచ్చిన ఓట్లు అయిన రావాలి కదా..? 2019 లో టీడీపీకి 4,94,501 ఓట్లు వస్తే , తాజా ఎన్నికల ఫలితాల్లో 3,54,516 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే సుమారు 1,40,000 ఓట్లు తగ్గాయి.. మరి దీని గురించి చంద్రబాబు ఏమని చెపుతాడు… ?
2019 లో వైసీపీ కి 7,22,877 ఓట్లు వస్తే తాజా ఫలితాల్లో 6,26,108 ఓట్లు మాత్రమే వచ్చాయి.. అంటే రమారమి 96 వేల ఓట్లు తగ్గినా కానీ 2019 లో వచ్చిన మెజారిటీ కంటే కూడా 40 వేల మెజారిటీ ఎక్కువ వచ్చింది.. ఈ గణాంకాలు చాలవా ఎవరి మీద ప్రజలకు నమ్మకం ఉందొ.. ? ఎవరి మీద ప్రజలకు వ్యతిరేకత ఉందో..? తెలుసుకోవటానికి . ఇప్పటికైనా బాబు ఈ అసత్యాలను మానుకొని నిజాలేమిటో తెలుసుకుంటే రాబోయే రోజుల్లో కనీసం పార్టీకైనా భవిష్యత్ అనేది ఉంటుంది.