Chandrababu : చంద్రబాబును నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ.. ఆయన సర్దేసుకోవాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్రబాబును నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ.. ఆయన సర్దేసుకోవాల్సిందే

Chandrababu : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ పొత్తుల కోసం ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశలు అడియాశలు అవ్వాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి మరియు జనసేన తో కలిసి 2014 తరహా పోటీ కి వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తమ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 March 2022,7:00 am

Chandrababu : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ పొత్తుల కోసం ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశలు అడియాశలు అవ్వాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి మరియు జనసేన తో కలిసి 2014 తరహా పోటీ కి వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తమ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే 2014 పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు.. అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన మరియు ఇతర అంశాలు ఆ సమయంలో కీలకంగా పని చేశాయి. చంద్రబాబు నాయుడు అనుభవం పై కొందరు నమ్మకం తో ఆయనకు కొత్త రాష్ట్రాన్ని అప్పగించాలని భావించారు. కొత్త వ్యక్తి అయినా జగన్మోహన్రెడ్డికి అధికార బాధ్యతలు అప్పగిస్తే ఆయన సరిగ్గా నిర్వహించలేరేమో అని ఆ సమయంలో కొందరు భావించి ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. 2019 నుండి ఇప్పటి వరకు ఆయన అద్భుతమైన పరిపాలన అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అందుతున్నాయి.

Chandrababu political analysis on tdp janasena bjp alliance

Chandrababu political analysis on tdp janasena bjp alliance

కనుక 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మూడు నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా ఆయనకు కలిగే లాభం ఏమీ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే అధికంగానే ఈసారి సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చంద్రబాబు నాయుడు పార్టీని మరియు వారి కూటమిని జనాలు నమ్మే పరిస్థితి లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. 2014 సమయంలో పొత్తు పెట్టుకుని కొన్నాళ్ళకే విడిపోయిన వీళ్ళు మళ్ళీ ఎలా కలిసారు.. ఎందుకు కలిశారు అనేది జనాల్లో ప్రశ్న. కేవలం అధికారం కోసమే వీరి కలయిక అనేది కొందరు జనాల్లో వినిపిస్తున్న మాట. సింగిల్ గా పోటీ చేయాలనుకుంటున్న వైకాపా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది