ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బీభత్సంగా వ్యాప్తి చెందుతోంది. దానికి అడ్డుఅదుపు లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. టెస్టులు పెంచితే కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచాలి. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకు.. విధిగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడే వేయాల్సిందే. సెప్టెంబర్ లో వేస్తాం అంటే కుదరదు అని కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది. అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఏపీ సీఎం జగన్ తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. డైరెక్ట్ గా ప్రధాన మంత్రే.. సీఎం జగన్ తో మాట్లాడినప్పుడు.. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా గురించి అడగొద్దా? అసలు.. సీఎం జగన్.. మోదీతో ఏం మాట్లాడారో ఏమో… అంటూ సీఎం జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉంటే… సాక్షి పత్రికలో కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి లేఖ రాసిందని చెబుతూ ఇటీవల ప్రచురించారు. దానిపై పట్టాభిరామ్ మండిపడ్డారు. అది దొంగ పత్రిక.. దాంట్లో ప్రచురించిన లేఖను పరిశీలిస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్రాన్ని అనుమతి కోరినట్టుగా లేదు. కేంద్రం కూడా అనుమతి ఇస్తున్నట్టుగా ఎక్కడా లేదు. మరి.. ప్రభుత్వంలో పనిచేస్తే ఐఏఎస్ లకు, మంత్రులకు, సాక్షి పత్రిక యాజమాన్యానికి ఇంగ్లీష్ రాదా? మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం అంటారు కదా.. ఇంగ్లీష్ లో ఉన్న ఆ లేఖ సారాంశం ఏంటో తెలుసుకోకుండా.. ఏది పడితే అది అచ్చేస్తారా? రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకే వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు.. పర్మిషన్ ఇస్తున్నామని.. ఆ లేఖలో కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపితే… వీళ్లు మాత్రం తమకు నచ్చినట్టు ప్రచురించుకున్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు పెట్టలేకపోయింది. అందుకే… కేంద్రమే స్పందించి.. రాష్ట్రానికి లేఖ రాసింది. తన బాధ్యతను గుర్తు చుసింది. డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలే.. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేయొచ్చు.. అని లేఖలో స్పష్టం చేసింది అని ఆయన వెల్లడించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.