ChandraBabu : కేసీఆర్ జాతీయ పార్టీ మీద చంద్రబాబు ప్లానింగ్ ఇదే?
ChandraBabu: అసలు ఎవ్వరూ ఊహించినది ఇది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారని.. దాన్ని దసరా రోజున ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ.. ఎవ్వరికీ అంతుచిక్కకుండా దసరానాడు చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టారు. ఇవాళ్టి నుంచి టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పేరుతో చలామణి కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సీఎం కేసీఆర్.. ఇవాళ ప్రగతి భవన్ లో తన జాతీయ పార్టీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పలు ఇతర పార్టీలు కూడా కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు ప్రగతి భవన్ కు వచ్చారు.
పార్టీ కార్యవర్గ సమావేశంలోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వచ్చారు. జేడీఎస్, వీసీకే నేతలను టీఆర్ఎస్ పార్టీ ఘనంగా స్వాగతం పలికింది.
ChandraBabu : కేసీఆర్ జాతీయ పార్టీపై ఒక నవ్వు నవ్విన చంద్రబాబు
అయితే.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ గురించి తెలుసుకున్న చంద్రబాబు స్పందన తెలుసుకోవడం కోసం మీడియా ప్రయత్నాలు చేసింది. అయితే.. చంద్రబాబు మాత్రం కేసీఆర్ జాతీయ పార్టీపై ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు.. ఏపీ రాజధాని గురించి స్పందించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పైన మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు. నవ్వుతూ వెళ్లిపోయారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.