ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన ఘనుడు. ఆ విషయంను ఎవరు కాదు అనలేరు. ఒకానొక సమయంలో కేంద్రంలో అధికారం ఏర్పడటం లో కీలక పాత్ర పోషించాడు. ప్రధాని అయ్యే అవకాశం కూడా బాబుకు వచ్చిందని అంటారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో బాబు లాంటి చిన్న పార్టీ నాయకులకు కూడా ప్రధాని పదవి ఆఫర్ లు రావడం కామన్ విషయం. ఆ విషయం పక్కన పెడితే సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా తన పట్టు కోల్పోయాడు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సూచించిన వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం జరిగింది అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు చెప్పిన వాళ్లకే ఉప రాష్ట్రపతి మరియు ప్రధాని పదవులు ఇచ్చారు అంటూ తెలుగు తమ్ముళ్లు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయాలను పదే పదే చెప్పేవారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అత్యంత గడ్డు కాలంను చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు నిలువబోతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు ఆయా పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో లేడు. అలాగే అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఉన్నారు. దాంతో ఎలక్ట్రోరల్ కాలేజ్ లో టీడీపీ ఓట్ల శాతం కనీసం 1 శాతం కూడా లేదు. దాంతో రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కనీసం కూడా ప్రభావం చూపించలేక పోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైకాపా మరియు టీఆర్‌ఎస్ లకు దాదాపుగా మూడు శాంతం ఎలక్ట్రోరల్ కాలేజ్ లో ఓట్లు ఉండటం వల్ల అధికార విపక్ష కూటములు ఈ రెండు పార్టీల వెంట పడుతున్నాయి. జగన్ మరియు కేసీఆర్ ల మాట కీలకం అవ్వబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పాల్గొన్నా పాల్గొనకపోయినా పట్టించుకునే వారే లేరు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.