ChandraBabu : రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి చంద్రబాబు పాత్ర మరీ దారుణం..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ChandraBabu : రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి చంద్రబాబు పాత్ర మరీ దారుణం..!

ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన ఘనుడు. ఆ విషయంను ఎవరు కాదు అనలేరు. ఒకానొక సమయంలో కేంద్రంలో అధికారం ఏర్పడటం లో కీలక పాత్ర పోషించాడు. ప్రధాని అయ్యే అవకాశం కూడా బాబుకు వచ్చిందని అంటారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో బాబు లాంటి చిన్న పార్టీ నాయకులకు కూడా ప్రధాని పదవి ఆఫర్ లు రావడం కామన్‌ విషయం. ఆ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,6:00 am

ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన ఘనుడు. ఆ విషయంను ఎవరు కాదు అనలేరు. ఒకానొక సమయంలో కేంద్రంలో అధికారం ఏర్పడటం లో కీలక పాత్ర పోషించాడు. ప్రధాని అయ్యే అవకాశం కూడా బాబుకు వచ్చిందని అంటారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో బాబు లాంటి చిన్న పార్టీ నాయకులకు కూడా ప్రధాని పదవి ఆఫర్ లు రావడం కామన్‌ విషయం. ఆ విషయం పక్కన పెడితే సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా తన పట్టు కోల్పోయాడు.

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సూచించిన వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం జరిగింది అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు చెప్పిన వాళ్లకే ఉప రాష్ట్రపతి మరియు ప్రధాని పదవులు ఇచ్చారు అంటూ తెలుగు తమ్ముళ్లు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయాలను పదే పదే చెప్పేవారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అత్యంత గడ్డు కాలంను చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు నిలువబోతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు ఆయా పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

ChandraBabu role in 2022 Indian presidential election

ChandraBabu role in 2022 Indian presidential election

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో లేడు. అలాగే అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఉన్నారు. దాంతో ఎలక్ట్రోరల్ కాలేజ్ లో టీడీపీ ఓట్ల శాతం కనీసం 1 శాతం కూడా లేదు. దాంతో రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కనీసం కూడా ప్రభావం చూపించలేక పోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైకాపా మరియు టీఆర్‌ఎస్ లకు దాదాపుగా మూడు శాంతం ఎలక్ట్రోరల్ కాలేజ్‌ లో ఓట్లు ఉండటం వల్ల అధికార విపక్ష కూటములు ఈ రెండు పార్టీల వెంట పడుతున్నాయి. జగన్ మరియు కేసీఆర్ ల మాట కీలకం అవ్వబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పాల్గొన్నా పాల్గొనకపోయినా పట్టించుకునే వారే లేరు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది